Heroines : ఐటెం సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్స్

సమంత ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తుండటంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. కానీ సమంత కంటే ముందే చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో........

Heroines : ఐటెం సాంగ్స్ చేసిన స్టార్ హీరోయిన్స్

Heroines

Heroines :  సమంత ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుంది అనడంతో అంతా షాక్ అయ్యారు. స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ ఎందుకు చేస్తుంది అని తలలు కొట్టుకున్నారు. నిన్న సమంత ‘పుష్ప’ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ లిరికల్ విడుదల అయింది. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేస్తుండటంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. కానీ సమంత కంటే ముందే చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ లో ఆడి పాడి అలరించారు.

DVV Danayya : ఏపీ సినిమా టికెట్ రేట్లతో నిర్మాతలకు వర్కవుట్ అవ్వదు : ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య

గతంలో ఐటమ్ సాంగ్ చేయాలంటే వాటి కోసం కొంతమంది ఆర్టిస్ట్ లు ఉండేవాళ్ళు. సిల్క్ స్మిత, జయమాలిని, జయచిత్ర లాంటి ఆర్టిస్టులు నటనతో పాటు స్పెషల్ గా ఐటెం సాంగ్స్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ముమైత్ ఖాన్ లాంటి వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. దీంతో హీరోయిన్స్ కాస్త ఐటెం భామలుగా మారిపోతున్నారు. బాలీవుడ్ లో ఈ పద్ధతి మొదలైంది. టాప్ ఫాంలో ఉన్నప్పుడే కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్స్ ఐటమ్ సాంగ్స్ చేశారు. దీంతో ఇది తెలుగుకి కూడా పాకింది.

Bigg Boss 5 : దిమ్మ దిరిగే ప్రశ్న అడిగిన ప్రేక్షకుడు.. షాక్ అయిన కాజల్

గతంలో రాశి, రంభ, రమ్యకృష్ణ లాంటి వాళ్ళు కూడా స్పెషల్ సాంగ్స్ చేశారు. కానీ వాళ్ళు హీరోయిన్ గా ఫేమ్ తగ్గిన తర్వాత చేశారు. స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ మొదలుపెట్టింది మాత్రం శ్రియ‌ సరన్. వరస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే రామ్ మొదటి సినిమా ‘దేవదాసు’లో ఐటెం సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రియా. ఆ పాట అప్పట్లో బాగా పాపులర్ అయింది. అంతే కాక ఆ తర్వాత కూడా మున్నా, తులసి, కొమరం పులి సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసింది. దీంతో వేరే హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్ వైపు అడుగులు వేశారు.

Shriya : సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన శ్రియ

హీరోయిన్ తమన్నా కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే అల్లుడు శీను, కేజీఎఫ్, జై లవకుశ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. హన్సిక ‘బిల్లా’లో, శృతి హాసన్ ‘ఆగడు’లో, అనుష్క ‘స్టాలిన్’లో, ఛార్మి ‘భాయ్’ సినిమాలో ఐటెం సాంగ్స్ తో రెచ్చిపోయారు. ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే కూడా ‘రంగస్థలం’ సినిమాలో జిగేలు రాణి ఐటెం సాంగ్ తో కుర్రకారుని హీటెక్కించింది. ఇక ఇప్పుడు సమంత కూడా ఐటెం భామగా మారిపోయింది. కేవలం స్టార్ హీరోయిన్స్ కాకుండా చిన్న సినిమాల్లో చేసే హీరోయిన్స్, సెకండ్ హీరోయిన్స్ గా చేసేవాళ్ళు అయితే చాలా మంది ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నారు.

Samantha : ‘పుష్ప’ ఐటెం సాంగ్‌లో సమంత అదరగొట్టే స్టిల్స్

అయితే స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ చేయడానికి ముఖ్యంగా రెండు కారణాలు. ఒకటి గుర్తింపు, రెండు డబ్బు. ఐటెం సాంగ్ చేస్తే బాగా పాపులర్ అయి గుర్తింపు వస్తుంది. వేరే భాషల్లో కూడా ఈ సాంగ్స్ తో పాపులర్ అవ్వొచ్చు. అభిమానులని, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు. ఇక ఒక సినిమాకి తీసుకునే రెమ్యునరేషన్ లో దాదాపు సగం పైగా ఒక ఐటెం సాంగ్ కి తీసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఫేమ్ ఉన్నప్పుడే డబ్బు సంపాదింస్తున్నారు స్టార్ హీరోయిన్స్.

Aryan Khan : బెయిల్‌ షరతులను మార్చాలంటూ కోర్టుని ఆశ్రయించిన ఆర్యన్ ఖాన్

‘పుష్ప’ సినిమా కోసం కేవలం ఐదు రోజుల షూటింగ్ చేసి సమంత కోటిన్నర రూపాయలకు పైగా పారితోషికం అందుకుంది. సమంత ఒక సినిమాకి 2 కోట్లు తీసుకుంటుంది. కానీ 30 రోజులు డేట్లు ఇవ్వాలి. అదే ఐటెం సాంగ్ ఐతే వారం రోజుల్లో కోటి పైగా సంపాదించవచ్చు. మిగిలిన హీరోయిన్స్ కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పూజా హెగ్డే కూడా ‘రంగస్థలం’ సినిమా కోసం 2 సంవత్సరాల క్రితమే దాదాపు 60 లక్షలు తీసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్స్ అంతా డబ్బుల కోసం, గుర్తింపు కోసం ఐటెం సాంగ్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.