Film Actress: హీరోయిన్స్ హార్డ్ వర్క్.. హీరోలతో సమానంగా స్టంట్లు!

హీరోయిన్లు.. సినిమాలో వచ్చామా.. రెండు డ్యాన్సులేశామా.. 4 సీన్లు చేశామా అన్న సో కాల్డ్ కమర్షియల్ సినిమాలకు ఇంట్రస్ట్ చూపించడం లేదు.

Film Actress: హీరోయిన్స్ హార్డ్ వర్క్.. హీరోలతో సమానంగా స్టంట్లు!

Film Actress

Film Actress: హీరోయిన్లు.. సినిమాలో వచ్చామా.. రెండు డ్యాన్సులేశామా.. 4 సీన్లు చేశామా అన్న సో కాల్డ్ కమర్షియల్ సినిమాలకు ఇంట్రస్ట్ చూపించడం లేదు. హీరోలతో సమానంగా ఫిజికల్ స్టంట్లు చేస్తున్నారు. ఫిజిక్ ని మేకోవర్ చేస్కుంటున్నారు. అంతకు మించి అదిరిపోయే స్పోర్ట్స్ బయోపిక్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బయోపిక్స్ సేలబుల్ సినిమాలు. వాటిలో స్పెషల్ గా కనిపించాలంటే.. అలాంటి ఇలాంటి బయోపిక్ కాదు.. అదిరిపోయే స్పోర్ట్స్ బయోపిక్ అయ్యిండాలి.

South Stars: తెలుగుపై మనసుపారేసుకుంటున్న సౌత్ హీరోలు

అందుకే హీరోయిన్లు జస్ట్ గ్లామర్ డాల్స్ లా కాకుండా కష్టపడి స్పోర్ట్ పర్సన్ గా మారిపోతున్నారు. లేటెస్ట్ గా తాప్సీ కూడా తన అప్ కమింగ్ మూవీ రష్మిరాకెట్ కోసం ఫుల్ బాడీని స్పోర్ట్స్ కి కావల్సినట్టు మేకోవర్ చేసుకుంది. గుజరాతీ స్ప్రింట్ రన్నర్ రష్మీ క్యారెక్టర్ కోసం జిమ్ లో గంటలు గంటలు కష్టపడి మస్క్యులర్ బాడీని సొంతం చేసుకుంది తాప్సీ. ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Prabhas: పక్కా ప్లాన్.. ఒకేసారి 4 సినిమాలు లైన్లో పెట్టిన యూనివర్సల్ స్టార్!

తాప్సీ మరో ఇంట్రస్టింగ్ స్పోర్ట్స్ బయోపిక్ చేస్తోంది. విమెన్స్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో తెరెకెక్కుతున్న సినిమా శభాష్ మిథు. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న శభాష్ మిథు మూవీ కోసం క్రికెట్ నేర్చుకోవడంతో పాటు మిధాలీగా కనిపించడానికి కంప్లీట్ మేకోవర్ అయ్యింది తాప్సీ. ఫిజికల్ గా మెంటల్ గా మిథాలీగా మారడానికి మిధాలీ రాజ్ నుంచి చాలా టిప్స్ తీసుకున్నానంటోంది తాప్సీ.

Drugs Case: నేడు ఈడీ ముందుకు తరుణ్.. విచారణ ముగుస్తుందా?

ఇండయాస్ ఫస్ట్ ఫీమేల్ ఒలింపిక్ మెడలిస్ట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది తెలుగుతేజం కరణం మల్లీశ్వరి. వెయిట్ లిఫ్టింగ్ తో దేశ కీర్తిని పైకి లేపిన మల్లీశ్వరి బయోపిక్ ని కూడా తెరమీదకెక్కిస్తున్నారు. కోన వెంకట్ ప్రొడక్షన్స్ లో సంజనా రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కబోతోంది ఈ సినిమా. లేటెస్ట్ ఒలింపిక్స్ లో మరో మెడల్ సాధించిన మరో తెలుగమ్మాయి పి.వి సింధు. బ్యాడ్మింటన్ లో మెడల్ సాధించిన పి.వి సింధు బయోపిక్ ని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకోన్ చేస్తోంది. తన సొంత బ్యానర్ కా ప్రొడక్షన్ లో సినిమాని తెరకెక్కిస్తోంది దీపికా. దీనికోసం గంటలు గంటలు బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ కూడా చేస్తోంది దీపికా.