Shruti Haasan-Tamannaah: సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న హీరోయిన్లు

హీరోయిన్లకు కెరీర్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అలాంటిది టాప్ హీరోయిన్లుగా ఒక ఊపు ఊపిన వాళ్లు తర్వాత అవకాశాలు లేక ఫేడవుట్..

Shruti Haasan-Tamannaah: సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్మురేపుతున్న హీరోయిన్లు

Shruti Haasan Tamannaah

Shruti Haasan-Tamannaah: హీరోయిన్లకు కెరీర్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. అలాంటిది టాప్ హీరోయిన్లుగా ఒక ఊపు ఊపిన వాళ్లు తర్వాత అవకాశాలు లేక ఫేడవుట్ అయిపోయారు. మళ్లీ అదే హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన హీరోయిన్స్ దుమ్మురేపుతున్నారు.

Prabhas: పాన్ వరల్డ్ రేంజ్.. ప్రభాస్ ఇకపై పాన్ ఇండియాస్టార్ కాదు!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా సౌత్ మొత్తం తెగ హడావిడిచేశారు. కానీ మధ్యలో కొత్త హీరోయిన్లు రావడం, వీళ్లకు అవకాశాలు తగ్గడంతో కాస్త డల్ అయ్యి సైడైపోయారు శృతి హాసన్, తమన్నా. మధ్యలో ఓటీటీ లో వెబ్ సిరీస్ లతో స్మాల్ స్క్రీన్ ని కూడా ఎంగేజ్ చేసిన ఈ భామలు ఇప్పుడు సెకండ్ ఇన్సింగ్స్ లోదుమ్మురేపుతున్నారు. శృతి హాసన్ అయితే ఏకంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ.. మరోసారి ఫుల్ ఎంగేజ్ అయిపోయింది.

Bheemla Nayak: భీమ్లా వాయిదా పడిందా? లేక శర్వా ధైర్యం చేశాడా?

శృతి హాసన్ లాస్ట్ 2 ఇయర్స్ పెద్దగా సినిమాలు చెయ్యకుండా కెరీర్ కి పాజ్ ఇచ్చింది. కానీ మళ్లీ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తెగ బిజీ అయ్యింది. వరసగా వకీల్ సాబ్, క్రాక్ సినిమాలతో మంచి హిట్ కొటిన శృతి ఇప్పుడు బాలకృష్ణతో సినిమా సైన్ చెయ్యడంతో పాటు సలార్ లోప్రభాస్ సరసన ఆద్య క్యారెక్టర్ లో కనిపించబోతోంది. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన శృతి ఫస్ట్ లుక్ చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు ఫాన్స్. ఈ సినిమాలతో పాటు సౌత్ లో మరికొన్ని ప్రాజెక్టస్ కి ఓకే చెప్పి సెకండ్ ఇన్సింగ్స్ లో మరోసారి బిజీ అయిపోయింది ఈ స్టార్ హీరోయిన్.

Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

మరో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా అప్పట్లో చిన్నా పెద్దా హీరోలన్న తేడా లేకుండా వరసపెట్టి అందరు హీరోలతో సినిమాలుచేసి టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే తర్వాత తమన్నా కూడా కెరీర్ లో అవకాశాల కోసం వెయిట్ చేసింది. ఓటీటీలో సిరీస్ లు చేసింది. మళ్లీ అందరి దృష్టిలో పడి సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి కెరీర్ లో అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం తమన్నా.. ఎఫ్ 3 సినిమాతో పాటు, గుర్తుందా శీతాకాలం, సినిమాలతోపాటు మెగాస్టార్ భోళాశంకర్ సినిమాలో హీరోయిన్ గా బిజీ అయిపోయింది. అంతే కాదు హిందీలో కూడా 2..3 ప్రాజెక్ట్స్ తో పాటు తెలుగులో గనిలో స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించబోతోంది తమన్నా.