Lavanya Tripathi : నిన్న నివేదా.. నేడు లావణ్య.. పర్వతాలను ఎక్కేస్తున్న హీరోయిన్స్

ఇటీవల మన హీరోయిన్స్ సాహసాలు చేస్తున్నారు. షూటింగ్స్ లేనప్పుడు ప్రపంచంలో వాళ్ళకి నచ్చిన ప్లేస్ కి వెళ్తూ సాహసోపేతమైన పనులు చేస్తూ చాలా మంది మహిళలకు ఇన్స్పిరేషన్ గా కూడా

Lavanya Tripathi : నిన్న నివేదా.. నేడు లావణ్య.. పర్వతాలను ఎక్కేస్తున్న హీరోయిన్స్

Lavanya

Lavanya Tripathi :  మన సెలబ్రిటీలకు యాక్టింగ్ తో పాటు వేరే అభిరుచులు కూడా ఉంటాయి. ఒక్కో సెలెబ్రిటీకి ఒక్కో అభిరుచి ఉంటుంది. కొంతమందికి సాహసాలు చేయడం ఇష్టం. ఇటీవల మన హీరోయిన్స్ సాహసాలు చేస్తున్నారు. షూటింగ్స్ లేనప్పుడు ప్రపంచంలో వాళ్ళకి నచ్చిన ప్లేస్ కి వెళ్తూ సాహసోపేతమైన పనులు చేస్తూ చాలా మంది మహిళలకు ఇన్స్పిరేషన్ గా కూడా నిలుస్తున్నారు. ఎంతో మందికి సాధ్యం కాని పనులను మన హీరోయిన్స్ చేసి చూపిస్తున్నారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ శ్రీరామచంద్ర కోసం మొన్న హీరోయిన్.. ఇవాళ బాలీవుడ్ కమెడియన్

ఇటీవల హీరోయిన్ నివేద థామస్ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన ఈ పర్వతాన్ని ఎంతోమంది పర్వతారోహకులు అధిరోహించాలని ట్రై చేస్తూ ఉంటారు. కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో కిలిమంజారోను అధిరోహించడం సాహసంతో కూడినది. అలాంటి సాహసాన్ని మన నివేదా చేసి ఆ పర్వతాన్ని అధిరోహించింది. భారతదేశం నుంచి ఆ పర్వతాన్ని అధిరోహించిన వారిలో తాను కూడా చోటు సంపాదించింది.

Bigg Boss 5 : ఎవడిక్కావాల్రా నీ సారీ.. ఒకరిపై ఒకరు ఫైర్ అయిన షన్ను సిరి

తాజాగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి కూడా పర్వాతారోహణ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఉత్తరాఖండ్‌లోని 8,848 మీటర్ల ఎత్తున్న జార్జ్ ఎవరెస్ట్‌ శిఖరాన్ని లావణ్య అధిరోహించింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా లావణ్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. లావణ్య కూడా ఓ పర్వతారోహకురాలిగా ఎంతో సాహసం చేసి ఈ పర్వతాన్ని అధిరోహించింది. ఇలా హీరోయిన్స్ సాహసాలు చేస్తుంటే అభిమానులు పొంగిపోతున్నారు. దేశ ప్రజలు కూడా గర్వపడుతున్నారు. మున్ముందు ఇంకెంతమంది హీరోయిన్లు ఎలాంటి సాహసాలు చేస్తారో చూడాలి.