రూట్ మార్చిన సౌత్ – కంటెంట్ ఉంటే మేకప్‌తో పనిలేదు

కథ నచ్చితే క్యారెక్టర్ ప్రకారం డీ గ్లామర్ రోల్స్‌లో కనిపించడానికి సై అంటున్నారు మన కథానాయకులు..

  • Published By: sekhar ,Published On : February 12, 2020 / 08:17 AM IST
రూట్ మార్చిన సౌత్ – కంటెంట్ ఉంటే మేకప్‌తో పనిలేదు

కథ నచ్చితే క్యారెక్టర్ ప్రకారం డీ గ్లామర్ రోల్స్‌లో కనిపించడానికి సై అంటున్నారు మన కథానాయకులు..

పదే పదే అదే మొహం చూస్తూ ఉంటే బోర్ ఫీల్ అవుతాం. స్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో మరీనూ. ఎప్పటికప్పుడు స్క్రీన్ మీద కొత్తగా కనిపిస్తూండాలి. అసలు ఇంతకు ముందు చూసింది ఈ హీరోనేనా అనిపించాలి. అలా ఉంటేనే ఆడియన్స్‌కి ఇంట్రెస్ట్. వేరియేషన్ లేకపోతే ఈ జనరేషన్‌లో వర్కవుట్ అవదు. అందుకే ఎప్పుడూ లవర్ బాయ్స్, క్యూట్ బాయ్స్‌లా స్వీట్‌గా సాఫ్ట్‌‌గా కనిపించే హీరోలు ఇప్పుడు డీ గ్లామర్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేస్తున్నారు.

డీ గ్లామర్ రోల్స్‌లో బాబాయ్ – అబ్బాయ్
రానా.. ఈ మ్యాన్లీ హంక్ మొన్న మొన్నటి వరకూ తన టోన్డ్ బాడీతో, సూపర్బ్ లుక్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పడు తన స్మార్ట్ నెస్‌ని పక్కనపెట్టి.. డీ గ్లామర్‌గా కనిపిస్తున్నాడు. ఏనుగుల్ని ట్రెయిన్ చేసే మావటిగా ‘అరణ్య’ సినిమాలో కనిపిస్తున్నాడు. లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ఈ లుక్‌లో అసలు తన గ్లామర్‌ని మొత్తం పక్కన పెట్టేశాడు.  లాస్ట్ ఇయర్ బాలీవుడ్‌లో రిలీజ్ అయిన ‘హౌస్ ఫుల్ 4’ లో కూడా కంప్లీట్ డీ గ్లామర్ లుక్‌లో కనిపించాడు.

rana

సీనియర్ హీరో అయినా స్టిల్ స్టైల్ మెయింటెన్ చేసే  విక్టరీ వెంకటేష్ కూడా ఈ సారి డీ గ్లామర్ లుక్ వైపు ఇంట్రెస్ట్ చూపించాడు. తమిళ్‌లో హిట్ అయిన ధనుష్ సినిమా ‘అసురన్’ కి రీమేక్‌గా వస్తున్న ‘నారప్ప’ మూవీలో తలపాగాతో పల్లెటూరి మనిషిగా కంప్లీట్ డీగ్లామర్‌గా కనిపిస్తున్నాడు. 

venky

‘జాను’ కోసం మేకప్ లేకుండా..
ప్రతి సినిమాకీ ఏదో ఒక డిఫరెన్స్ చూపించే శర్వానంద్ కూడా ఈ సారి డీగ్లామర్ లుక్ మీద మోజు పడ్డాడు. ఇప్పటి వరకూ సెన్సిబుల్, సెటిల్డ్ రోల్స్ చేసిన శర్వా.. ‘జాను’ సినిమా కోసం తన మెయింటెనెన్స్ మొత్తాన్ని పక్కన పెట్టేశాడు. గ్రే హెయిర్, వెయిట్ పెరిగిన బాడీ, అస్సలు ఏమాత్రం పట్టించుకోని లుక్స్..ఇలా డీగ్లామర్‌గా కనిపించాడు.  

jaanu

తెలుగు తెరకు సరికొత్త విలన్..
విజయ్ సేతుపతి సౌత్‌లో మంచి పర్ఫార్మెన్స్ చూపించే యాక్టర్. మొన్నమొన్నటి వరకూ హీరోగానే కాకుండా విలన్ క్యారెక్టర్స్ కూడా చేసిన విజయ్.. ఇప్పుడు ‘ఉప్పెన’ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. విలన్ అంటే.. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్నట్టు.. సూటు, బూటు వేసుకునే స్టైలిష్ విలన్ కాదు..

vijay sethupathi

లుంగీ కట్టుకుని తల నిండా నూనెతో, జిడ్డు కారుతున్న ముఖంతో.. కంప్లీట్ డీ గ్లామర్ రోల్‌లో కనిపిస్తున్నాడు. ‘విక్రమ్ వేద’, ‘పేట’ వంటి సినిమాల్లో విజయ్ రగ్గడ్ లుక్స్, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన సేతుపతి లుక్‌కి మంచి స్పందన వస్తోంది.