Movie shootings : హీరోస్.. బ్యాక్ టు షూటింగ్స్..

 సంక్రాంతి సీజన్ ఇలా ముగిసిందో లేదో స్టార్ హీరోలందరూ ఒకేసారి తమ లేటెస్ట్ మూవీస్ షూటింగ్స్ ను తిరిగి మొదలుపెట్టేశారు. మెగాస్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకూ తమ నెక్స్ట్ మూవీస్ షూటింగ్స్ ను తిరిగి మొదలు పెట్టి.........

Movie shootings : హీరోస్.. బ్యాక్ టు షూటింగ్స్..

Heros going back to movie shootings after sankranthi

Movie shootings :  సంక్రాంతి సీజన్ ఇలా ముగిసిందో లేదో స్టార్ హీరోలందరూ ఒకేసారి తమ లేటెస్ట్ మూవీస్ షూటింగ్స్ ను తిరిగి మొదలుపెట్టేశారు. మెగాస్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకూ తమ నెక్స్ట్ మూవీస్ షూటింగ్స్ ను తిరిగి మొదలు పెట్టి అభిమానుల్ని ఖుషీ చేశారు.

‘వాల్తేరు వీరయ్య’ బ్లాక్ బస్టర్ తో ‘భోళా శంకర్’ టీమ్ కు ఊపొచ్చినట్టుంది. ఈ మూవీ తరువాత చిరంజీవి నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘భోళా శంకర్’. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ ఆధారంగా ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. చిరుకు సిస్టర్ గా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన తాజా షెడ్యూల్ ని జనవరి 17న ప్రారంభించారు. కోల్ కతా కాళీ సెట్ లో ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాలని చిత్రీకరిస్తున్నారు. చిరంజీవికి సెట్ లోకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు చిత్రయూనిట్.

గతేడాది డిసెంబర్ నెలలో 5 రోజులు ‘పుష్ప 2’ షూటింగ్ లో పాల్గొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. వైజాగ్ లో సినిమా షూటింగ్ నడుస్తోంది. సినిమాను 2024 వేసవిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియాలో ఈ సినిమా విడుదల అయిన రోజే మిగతా దేశాల్లో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ పార్ట్ 2 లోనూ కంటిన్యూ అవుతుండగా మరికొన్ని పాత్రలు యాడ్ అవుతాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో బన్నీ జాయిన్ అవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ ని సైలెంట్ గా స్టార్ట్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత మహేష్ సెట్ లోకి వచ్చినట్టు సమాచారం. షూటింగ్ స్పాట్ నుంచి ఓ వీడియో కూడా లీక్ అవడంతో అభిమానులు హమ్మయ్య మహేష్ మొత్తానికి షూట్ మొదలుపెట్టాడని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సారథీ స్టూడియోస్ లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

‘ధమాకా, వాల్తేరు వీరయ్య’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు రవితేజ. ఇప్పుడు లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’ షూటింగ్ లో తిరిగి జాయిన్ అయ్యాడు. సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ డ్యూయెట్ సాంగ్ షూట్ జరుగుతోంది. అన్నపూర్ణ 7 ఏకర్స్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఫరియా అబ్దుల్లా పై మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. రవితేజ లాయర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నాడు.

NTR for Oscars : ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ ఫర్ ఆస్కార్స్.. ఈ టాప్ 10 కన్సిడర్ చేయండి ఆస్కార్ అంటూ హాలీవుడ్ మీడియా..

ఇంకా పలువురు యువ హీరోలు కూడా సంక్రాంతి హాలిడేస్ కి గుడ్ బై చెప్పి షూటింగ్స్ లో జాయిన్ అయ్యారు. మళ్ళీ సమ్మర్ వరకు పెద్ద సినిమాలు లేకపోవడంతో టాలీవుడ్ షూటింగ్స్ మీద దృష్టి పెట్టింది. శరవేగంగా చాలా సినిమాలు షూట్ జరుగుతున్నాయి. అటు తమిళ్ లో కూడా విజయ్, అజిత్ సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిపోవడంతో నెక్స్ట్ సినిమాల షూటింగ్ లో జాయిన్ అయ్యారు. రజినీకాంత్ కూడా జైలర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు.