High Budget Movies: నిర్మాతలకు షాక్ కొట్టే సినిమా బడ్జెట్.. ఎందుకిలా పెరిగిపోతుంది?

వందల కోట్లు పెట్టుబడి పెడితేనే జనం థియేటర్స్ కొస్తారా..? స్టార్ కాస్ట్ ఉంటేనే సినిమాకు స్టార్ స్టేటస్ ఇస్తారా..? రిచ్ లోకేషన్స్ లో కెమెరా పెడితేనే ఆడియెన్స్ చూస్తారా..? ఇంకా ఇంకా..

High Budget Movies: నిర్మాతలకు షాక్ కొట్టే సినిమా బడ్జెట్.. ఎందుకిలా పెరిగిపోతుంది?

High Budget Movies (1)

High Budget Movies: వందల కోట్లు పెట్టుబడి పెడితేనే జనం థియేటర్స్ కొస్తారా..? స్టార్ కాస్ట్ ఉంటేనే సినిమాకు స్టార్ స్టేటస్ ఇస్తారా..? రిచ్ లోకేషన్స్ లో కెమెరా పెడితేనే ఆడియెన్స్ చూస్తారా..? ఇంకా ఇంకా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్తోన్న మేకర్స్ ఎందుకిలా ఆలోచిస్తున్నారు.. అసలు పెద్ద హీరో సినిమా అంటే బడ్జెట్ ఎందుకు పెరిగిపోతుంది..?

High Budget Movies: వందల కోట్ల బడ్జెట్ మూవీస్.. టాలీవుడ్‌లో అసలేం ఏం జరుగుతుంది?

ఇప్పుడు సినిమా బడ్జెట్ పెరుగుతుంది అంటే కారణాలు చాలా ఉన్నాయి. స్టార్ హీరో డేట్స్ సంపాదించడమే నిర్మాతకు కత్తి మీద సాములాంటింది. అంత కష్టపడి హీరో ఎస్ చెప్పినందుకు భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పాల్సిందే. తెలుగు స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా హీరోలయ్యారు కాబట్టి రేట్ ఎక్కువగానే చెప్తున్నారు. ముట్టుకుంటే ఒక్కొక్కరూ 30 నుంచి 100 కోట్ల వరకు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు.

High Budget Movies: ఎఫీషియన్సీ లోపం.. సినిమాలను ఆదుకోలేని గ్రాండియర్!

బడ్జెట్ అమాంతం పెరగడానికి మెయిన్ రీజన్ పాన్ ఇండియా కాన్సెప్ట్. ఎస్ ఓ కథను పాన్ ఇండియా లెవెల్ లో తీసుకెళ్తున్నారంటే అదే లెవెల్ కంటెంట్ ను నమ్ముకుంటున్నారు. ప్రస్తుతం వందల కోట్లతో తెరకెక్కుతోన్న సినిమాలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. చిన్న హీరో, పెద్ద హీరో అని తేడా లేదు.. అందరూ పాన్ ఇండియా అంటేనే మోజు చూపిస్తున్నారు. ఆశ మంచిదే కానీ.. ఏ మేరకు ఖర్చుపెడితే గట్టెక్కుతామన్న ఆలోచనే అక్కడ మిస్ అవుతోంది.

Postpone Movies: క్రేజీ కాంబినేషన్స్.. కానీ సెట్స్ మీదకెళ్ళడం చాలా లేట్!

పాన్ ఇండియా సినిమా అంటే ఒక్క తెలుగు ఆర్టిస్టులు ఉంటే సరిపోదు.. బాలీవుడ్ హీరోయిన్ కావాలి.. అక్కడి క్రేజీ స్టార్స్ తో కీ రోల్స్ చేయించాలి. ముఖ్యంగా అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే ఫేస్ లను సెలక్ట్ చేసుకోవాలి. ఇంకేముంది బడ్జెట్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా అత్యంత ఘోరంగా నష్టపోతున్నాయంటే ఓ కారణం స్టార్ కాస్ట్ కూడా.

South India Movies: ఇండియన్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా సౌత్ సినిమాలు!

హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్, విఎఫ్ఎక్స్ ఎపెక్ట్స్.. ఇవి కూడా పెట్టుబడి పెరగడానికి రీజన్ అవుతున్నాయి. ట్రిపుల్ ఆర్ లాంటి గ్రాండియర్ ను ప్రెజెంట్ చేయాలంటే గ్రీన్ మ్యాట్ లో సీన్స్ షూట్ చేసి వీఎఫ్ఎక్స్ యాడ్ చేయాలి. అంతేనా కథకు తగ్గట్టు రిచ్ ఫారెన్ లోకేషన్స్ లో షూట్ చేయాలి. ఆ షూట్ లోకేషన్స్ కి యాక్టర్స్ తో పాటూ 60, 70 మంది టెక్నిషియన్స్ ను తీసుకెళ్లాలి. సో సింపుల్ గా చూస్తుండగానే నిర్మాతలకు తడిచి మోపెడవుతోంది.

New Directors: కంటెంట్‌తో కొడుతున్న కొత్త దర్శకులు.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు!

స్టార్ హీరో దొరికాడు.. పాన్ ఇండియా సబ్జెక్ట్ తో డైరెక్టర్ సై అన్నాడు.. స్టార్ కాస్ట్ సర్దుబాటు అయింది. ప్రపంచం మెచ్చే టెక్నీషియన్స్ సైన్ చేసారు. ఇలా భారీ బడ్జెట్ తో సినిమా రెడీ అయి ఫుల్ ప్రమోషన్స్ మధ్య ప్రాజెక్ట్స్ రెడీ అవుతున్నాయి. కానీ కొన్ని మాత్రమే ప్రాఫిట్ దక్కించుకుంటుంటే.. కొన్ని చతికిలపడుతున్నాయి. ఈ మధ్య వచ్చిన సినిమాలనే చూసుకుంటే క్లియర్ పిక్చర్ మనకే కనిపిస్తుంది.

Theaters VS OTT: నువ్వా నేనా.. టైమ్ చూసి దెబ్బ కొడుతున్న ఓటీటీలు!

జక్కన్న లెక్కల ప్రకారం ట్రిపుల్ ఆర్ బడ్జెట్ 550 కోట్లకు పైమాటే. అయితే పడిన కష్టం, ఖర్చు పెట్టిన టైమ్, చేసిన హై ప్రమోషన్స్ ప్రకారం ఆర్ఆర్ఆర్ ద్వారా 2 వేల కోట్లు సంపాదించాలనుకున్నారు రాజమౌళి. 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు సంపాదించింది కూడా. కానీ లాంగ్ రన్ లో బాహుబలి 2 షేర్స్ ని క్రాస్ చేస్తుందా అన్నది చూడాలి. లేదంటే లాభాలపరంగా అందరూ మైల్ స్టోన్ రీచయినట్టే కానీ బాహుబలి 2ను మించి 2 వేల కోట్లు రాబట్టాలనుకున్న రాజమౌళి లెక్కలే నిజం కాలేకపోతాయి.

Tollywood Heroins: ఎవరికి వాళ్ళే హాట్ ట్రెండ్.. ఒక్కొక్కరు ఒక్కోలా దూకుడు!

రాధేశ్యామ్ పరిస్థితి ఘోరాతి ఘోరం. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్.. నిర్మాతల దగ్గరి నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ప్రతిఒక్కరికీ లాస్ మిగిల్చింది. బాలీవుడ్ లో అయితే అట్టర్ ఫ్లాప్ ముద్ర వేసుకుంది. ప్రభాస్ కటౌట్ మాత్రమే సూపర్ హిట్ అనిపించుకోదు.. ఆ కటౌట్ కి తగ్గ కథ దొరికినప్పుడే లాభాల పంట పండుతుందని రాధేశ్యామ్ నిరూపించింది.

Upcoming Movies: ఒక హీరో కోసం రాసిన కథ.. మరో హీరోతో సినిమా!

తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన భీమ్లానాయక్ బ్లాక్ బస్టర్ కానీ.. ఆంధ్రలో టికెట్ రేట్స్ కారణంగా కొన్ని చోట్ల కాస్త నష్టాన్ని చూడాల్సివచ్చింది. ఓవరాల్ గా చూసుకుంటే పెట్టిన పెట్టుబడికి బాగానే గిట్టుబాటు అయింది. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ మినహా పెద్దగా ఖర్చు పెట్టని నిర్మాతలు.. సింపుల్ గా హిట్ కొట్టేసారు.. హ్యూజ్ షేర్స్ అందుకున్నారు.

Spy Movies: స్పైలుగా మారిపోతున్న హీరోలు.. హాలీవుడ్ జానర్ మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకో?

తక్కువ బడ్జెట్ తో వచ్చిన డిజె టిల్లు లాంటి సినిమాలు మంచి లాభాలు చూస్తున్నాయి. గతేడాది వచ్చిన జాతిరత్నాలు, ఉప్పెన లాంటి సినిమాలు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తీసుకొచ్చినవే. అలా అని చిన్న సినిమాలు కొన్ని అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు కోకొల్లలు. అంతిమంగా ఖర్చు కాదు కావాల్సింది కథలో కొత్తదనం, థియేటర్ కొచ్చి కూర్చుంటే అన్ని మర్చిపోయి ఆస్వాదించేలా చేయగలగడం.

Pan India Movies: స్క్రీన్ స్పేస్ ప్లీజ్.. తెలుగు సినిమాపై బాలీవుడ్ అలక?

2021 ఎండింగ్ లో అఖండ సైతం బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. లో బడ్జెట్ తో తెరకెక్కిన అఖండ.. హై ఎండ్ హిట్ కొట్టింది. బాలయ్యను 100 కోట్ల క్లబ్ లో చేర్చింది. ఇదీ డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు రిలీఫ్ ఇచ్చింది. ఇక పుష్ప సాలిడ్ హిట్ అనిపించుకున్నా.. అప్పటి పరిస్థితులు, టికెట్ రేట్స్ దృష్ట్యా అక్కడక్కడా నష్టాలను కూడా మిగిల్చింది.