సినిమా కష్టాలు – ప్రకాష్ రాజ్‌కు హైకోర్టు నోటీసులు

నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది..

  • Published By: sekhar ,Published On : February 28, 2020 / 05:40 AM IST
సినిమా కష్టాలు – ప్రకాష్ రాజ్‌కు హైకోర్టు నోటీసులు

నటుడు, నిర్మాత, దర్శకుడు ప్రకాష్ రాజ్‌కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది..

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేయడం చిత్రపరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీసింది. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నటించిన ప్రకాశ్‌రాజ్‌ నిర్మాత, దర్శకుడుగానూ మారిన సంగతి తెలిసిందే. తమిళ్‌లో ‘ధోని’, ‘ఉన్‌ సమయల్‌ అరైయిల్‌’ (తెలుగులో ఉలవచారు బిర్యాని), కన్నడలో ‘ఇదొళ్లె రామాయణ’ (తెలుగులో మనఊరి రామాయణం) వంటి చిత్రాలను స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించారు.

కాగా ప్రకాశ్‌రాజ్‌  ‘ఉన్‌ సమయల్‌ అరైయిల్‌’ (తెలుగులో ఉలవచారు బిర్యాని) మూవీని హిందీలో రీమేక్‌ చేయడానికి బాలీవుడ్‌ ఫైనాన్సియర్‌ ఒకరి వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకుని, అందుకుగానూ ఫైనాన్సియర్‌కు చెక్కును ఇచ్చారు. అది కాస్తా బ్యాంకులో బౌన్స్‌ అయ్యింది. దీంతో షాక్ అయిన సదరు ఫైనాన్సియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌పై మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయమూర్తి  ఏప్రిల్‌ 2వ తేదీలోగా కోర్టుకు హాజరవ్వాలని నటుడు ప్రకాశ్‌రాజ్‌కు సమన్లు జారీ చేశారు.

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘సాల్ట్ అండ్ పెప్పర్’ చిత్రానికి ‘ఉన్‌ సమయల్‌ అరైయిల్‌’ (తెలుగులో ఉలవచారు బిర్యాని) రీమేక్.. తమిళ్, తెలుగులో రెండు చోట్లా ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. మళ్లీ హిందీలో రీమేక్ చేయాలనుకోవడం వెనుక ఆంతర్యమేమిటో ప్రకాష్ రాజ్‌కే తెలియాలి 

Also Read | మంచులో స్టంట్.. చావు అంచుల్లోకి వెళ్లొచ్చిన టిక్‌టాక్ స్టార్