Nikhil : నిఖిల్ సినిమాలపై పెరిగిన అంచనాలు..

‘కార్తికేయ 2’ మూవీ నిఖిల్ కెరీర్ బెస్ట్ గా నిలిచిపోయింది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ భారయీ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ తో ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’ పై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా...............

Nikhil : నిఖిల్ సినిమాలపై పెరిగిన అంచనాలు..

high expectations on Nikhil Next Movies

Nikhil :  ‘కార్తికేయ 2’ మూవీ నిఖిల్ కెరీర్ బెస్ట్ గా నిలిచిపోయింది. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ భారయీ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ తో ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’ పై అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లో మ్యాజిక్ చేస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, రొమాంటిక్ మూమెంట్స్ కు తోడు ఎవరూ ఊహించని విధంగా కథకో క్రైమ్ ఎలిమెంట్ ను కూడా యాడ్ చేయడంతో సినిమా సాలిడ్ హిట్ గా నిలిచింది.

 

నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ ఒకరినొకరు చూడకుండానే వారిమధ్య మంచి ఫీల్ ను వర్కవుట్ చేశాడు డైరెక్టర్ సూర్య ప్రతాప్. రొటీన్ లవ్ స్టోరీస్ గా కాకుండా ఇందులోని రొమాంటిక్ యాంగిల్ ను సరికొత్త గా ప్రజెంట్ చేయడంతో దీన్నొక క్లాస్ మూవీగా ట్రీట్ చేస్తున్నారు ఆడియన్స్. పాజిటివ్ టాక్ తో పాటు రివ్యూస్ కూడా పాజిటివ్ గా రావడంతో నిఖిల్ కు ఇది వరుసగా రెండో హిట్ అయింది. ఇక కలెక్షన్స్ కూడా సాధించి ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా అయింది ఈ సినిమా.

‘18 పేజెస్’ తెచ్చిపెట్టిన సక్సెస్ తో నిఖిల్ నెక్స్ట్ మూవీ ‘స్పై’ కి మరింతగా హైప్ క్రియేట్ అయింది. ఇందులో సీక్రెట్ స్పైగా నటిస్తుండడం విశేషం కాగా ఇదొక యాక్షన్ అడ్వంచర్ కూడా. దీంతో వేరియస్ జోనర్స్ టచ్ చేస్తూ నిఖిల్ తన టాలెంట్ కు మరింత పదును పెడుతున్నట్టు అర్ధమవుతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే దీని తర్వాత రాబోతున్న ‘కార్తికేయ 3’ కూడా ఓ రేంజ్ లో అంచనాలున్నాయి. మరి ఈ సినిమాలతో నిఖిల్ హ్యాట్రిక్ హిట్స్ ను క్రాస్ చేస్తాడేమో చూడాలి.

Chandrika Ravi : వెన్నునొప్పితోనే డ్యాన్స్ చేశాను.. బాలకృష్ణతో స్పెషల్ సాంగ్ చేసిన ఆస్ట్రేలియా నటి..

మొదట కమర్షియల్ గా వెళ్లినా ఆ తర్వాత తన పంథా మార్చుకొని స్వామిరారా, కార్తికేయ, కేశవ, అర్జున్ సురవరం.. ఇలా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. నిఖిల్ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుందని టాలీవుడ్ లో, ప్రేక్షకుల్లో టాక్ కూడా ఉంది. ఇక ఇప్పుడు మరోసారి కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో డిఫ్రెంట్ స్క్రిప్ట్స్ తో హిట్స్ కొట్టడంతో నిఖిల్ నెక్స్ట్ సినిమాలపైనా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నెక్స్ట్ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ కూడా ప్లాన్ చేస్తూ కెరీర్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు నిఖిల్.