Shahrukh Khan : పఠాన్ హిట్ తో షారుఖ్ నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు..

‘పఠాన్’ సాధించిన సూపర్ సక్సెస్ తో షారుఖ్ నెక్స్ట్ మూవీస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోయింది. ప్రజెంట్ షారుఖ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. షారుఖ్...................

Shahrukh Khan : పఠాన్ హిట్ తో షారుఖ్ నెక్స్ట్ సినిమాలపై భారీ అంచనాలు..

high expectations on Shahrukh khan next movies after Pathaan Success

Shahrukh Khan :  ‘పఠాన్’ సెన్సేషనల్ హిట్ తో జోష్ మీదున్నాడు కింగ్ ఖాన్. చాన్నాళ్ళ పాటు సరైన హిట్ లేకుండా ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెట్టిన షారుఖ్ ఫైనల్ గా సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. నాలుగేళ్ల బ్రేక్ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ భారీ అంచనాలతో రిలీజైంది. ఫస్ట్ డే నుంచే సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ స్ప్రెడ్ అయింది. నాలుగు రోజుల్లోనే సినిమా వరల్డ్ వైడ్ గా 400 కోట్లను క్రాస్ చేసి షారుఖ్ సత్తా ఏంటో మరో సారి నిరూపించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో బాలీవుడ్ ఫ్యూచర్ పై ఏర్పడిన సందేహాలు పటాపంచలయ్యాయి. పఠాన్ తో కింగ్ ఖాన్ ఇంత స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

‘పఠాన్’ సాధించిన సూపర్ సక్సెస్ తో షారుఖ్ నెక్స్ట్ మూవీస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిపోయింది. ప్రజెంట్ షారుఖ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. షారుఖ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘జవాన్’. తమిళ డైరెక్టర్ అట్లీ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. దీపికా పదుకొణే క్యామియో అపీరెన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాది జూన్ 2న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. షారుఖ్ తో పాటు అట్లీ డైరెక్టర్ కావడం, షారుఖ్ ఫామ్ లోకి రావడంతో ఈ పాన్ ఇండియా సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pathaan : నాలుగు రోజుల్లో నాలుగొందల కోట్లు.. అత్యంతవేగంగా పఠాన్ మరో సరికొత్త రికార్డ్..

ఆ తర్వాత బాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఫస్ట్ టైమ్ షారుఖ్ తో సినిమా తీస్తున్నాడు. ఢంకీ అనే వెరైటీ టైటిల్ తో సినిమాని అనౌన్స్ చేసి ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఢంకీ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్, పీకే, సంజు లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో రూపొందుతున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇప్పుడు పఠాన్ బ్లాక్ బస్టర్ తో మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతోంది. మొత్తానికి పఠాన్ బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ కు అమేజింగ్ సక్సెస్ ఇచ్చిన షారుఖ్ ఈ ఏడాదిలోనే మరో రెండు సినిమాలతో వరుసగా ఫీస్ట్ ఇవ్వబోతున్నాడు. మరి ఈ రెండు సినిమాలు ఇంకే రేంజ్ కలెక్షన్స్ రాబడతాయో చూడాలి.