Himaja : డ్రీం హౌస్ కట్టుకుంటున్న నటి హిమజ..

  సీరియల్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా నటి హిమజ కెరీర్‌లో దూసుకుపోతుంది. బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొన్న తర్వాత హిమజకి సినిమా ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి. ఇటీవలే..

Himaja : డ్రీం హౌస్ కట్టుకుంటున్న నటి హిమజ..

Himaja

Himaja :  సీరియల్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా నటి హిమజ కెరీర్‌లో దూసుకుపోతుంది. బిగ్‌బాస్ సీజన్ 3లో పాల్గొన్న తర్వాత హిమజకి సినిమా ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి. ఇటీవలే ‘వరుడు కావలెను’ సినిమాలో సెల్ఫీ సరళ క్యారెక్టర్ తో అందర్నీ నవ్వించింది. సినిమాలు, బుల్లితెరతో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. యూట్యూబ్, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది హిమజ.

Suriya : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్.. త్వరలో ప్రకటన..

తాజాగా తాను డ్రీం హౌస్ కట్టుకుంటున్నట్లు తెలిపింది. తన డ్రీం హౌస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. తన డ్రీం హౌస్ కట్టుకుంటున్నట్టు, జరుగుతున్న తన ఇంటిపనులు అన్ని వీడియో తీసి యూట్యూబ్ లో త్వరలో నా డ్రీంహౌస్ రాబోతుంది అంటూ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియో లింక్‌ని పోస్ట్ చేసి.. ”నా డ్రీం నిజమవ్వబోతుంది.. నా డ్రీం హౌస్ కట్టుకుంటున్నాను. మీ ఆశీర్వాదాలు కావాలి నాకు. మీ సపోర్ట్ లేకుండా నేను ఇది సాధించలేను.” అంటూ పోస్ట్ చేసింది హిమజ.