Bigg Boss : హిందీ బిగ్‌బాస్ విన్నర్ ఎవరో తెలుసా?.. విన్నర్‌కి క్యాష్ ప్రైజ్‌తో పాటు..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా జరిగిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 ముగిసింది. 24మంది సెలబ్రిటీలతో 120 రోజుల పాటు ఈ షో జరిగింది. ఫైనల్ లో..............

Bigg Boss : బిగ్‌బాస్ షో అన్ని భాషల్లోనూ బాగా పాపులర్ అయింది. అన్ని భాషల్లోనూ ప్రేక్షకులు ఈ షోపై ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా జరిగిన హిందీ బిగ్‌బాస్ సీజన్ 15 ముగిసింది. 24మంది సెలబ్రిటీలతో 120 రోజుల పాటు ఈ షో జరిగింది. ఫైనల్ లో ప్రతీక్ సెహజ్ పాల్, తేజస్విని, కరణ్ కుంద్రా, షమితా శెట్టి పోటీ పడ్డారు.
ఆదివారం జరిగిన హిందీ బిగ్‌బాస్ ఫినాలే గ్రాండ్ గా జరిగింది. విన్నర్‌గా ఎవరు గెలుస్తారు అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చివరకు ప్రతీక్ సెహజ్ పాల్, తేజస్విని మధ్య ఫైనల్ టైటిల్ రేసు జరిగింది. సల్మాన్ ఖాన్ ఇద్దరి చేతుల్ని పట్టుకొని అందరి ఉత్కంఠ మధ్య తేజస్విని చెయ్యి పైకి ఎత్తాడు. దీంతో హిందీ బిగ్‌బాస్ సీజన్ 15లో తేజస్విని విన్నర్ గా నిలిచింది. ప్రతీక్ రన్నరప్‌గా నిలవగా, కరణ్ కుంద్రా, షమితా శెట్టి మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు.
Kalyanam Kamaneeyam : సింగర్ మనో.. సీరియల్ ఎంట్రీ..
విన్నర్ తేజస్విని ప్రకాష్ సీరియల్ నటి. 2015లో వచ్చిన ‘స్వరాగిణి’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయిన తేజస్విని ఆ తర్వాత పలు సీరియల్స్ తో ప్రేక్షకులని మెప్పించి అభిమానుల్ని సంపాదించింది. తాజాగా ఈ షో విన్ అవ్వడంతో బిగ్‌బాస్ సీజన్15 ట్రోఫీతో పాటు 40 లక్షల నగదు బహుమతిని అందుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ పాపులర్ సీరియల్ ‘నాగిని’కి రాబోయే సీక్వెల్ (నాగిని-6)లో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. దీంతో తేజస్విని ఆనందానికి హద్దులు లేవు. స్టేజిపైనే ఎమోషనల్ అయింది. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు తేజస్వినికి అభినందనలు తెలుపుతున్నారు.