HIT 2: ఆరు రోజుల్లోనే అన్ని చోట్లా లాభాలను తెచ్చిపెట్టిన హిట్-2

టాలీవుడ్ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘హిట్-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్‌లో రెండో భాగంగా తెరకెక్కించగా, ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు.

HIT 2: ఆరు రోజుల్లోనే అన్ని చోట్లా లాభాలను తెచ్చిపెట్టిన హిట్-2

HIT 2: టాలీవుడ్ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘హిట్-2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను హిట్ వర్స్‌లో రెండో భాగంగా తెరకెక్కించగా, ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ పవర్‌ఫుల్ పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా చేసిన ప్రమోషన్స్ ఈ సినిమా విజయంలో కీలకపాత్ర పోషించిందని చెప్పాలి.

HIT 2: హిట్-2 సక్సెస్ పై వెంకటేశ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?

ఈ సినిమాలోని సస్పెన్స్, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తీర్చిదిద్దన తీరుకు అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆరు రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని చోట్లా లాభాలను అందుకున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్‌కు చేరుకుందని.. ఇక రాబోయేది మొత్తం లాభాలే అని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

HIT 2: యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో చెడుగుడు ఆడేస్తున్న ‘హిట్-2’

హిట్-2 సినిమాను నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేయగా, ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా హిట్-3 ఉంటుందని, అందులో హీరోగా నాని నటిస్తాడని ఈ సినిమాలోనే చెప్పేశారు చిత్ర యూనిట్. ఏదేమైనా అడివి శేష్ ఖాతాలో మరో సూపర్ హిట్ మూవీ పడటమే కాకుండా, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు.