HIT 2: యూఎస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో చెడుగుడు ఆడేస్తున్న ‘హిట్-2’
యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ పాజిటివ్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. హిట్-2 చిత్రానికి ప్రీమియర్స్‌తోనే యూఎస్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, వీకెండ్లో ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది.

HIT 2 Rampage Collections At US Box office
HIT 2: యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ పాజిటివ్ రెస్పాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న హిట్ వర్స్‌లో రెండో పార్ట్‌గా ఈ సినిమా రావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక వారి అంచనాలు
అందుకునేలా ఈ సినిమా కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కడుతున్నారు. ఈ సినిమాలోని సస్పెన్స్, ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
Also Read: HIT 2: అడివి శేష్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హిట్-2
దీంతో వారు ఈ సినిమాను థియేటర్లలో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఓవర్సీస్లోనూ అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. హిట్-2 చిత్రానికి ప్రీమియర్స్‌తోనే
యూఎస్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో, వీకెండ్లో ఈ సినిమా అక్కడ భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు ఏకంగా
$700k వసూళ్లు సాధించి మిలియన్ డాలర్ మార్క్ వైపు పరుగులు పెడుతోంది.
Also Read: HIT 2: హిట్-2 హిందీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
అడివి శేష్ కెరీర్లో $700k మార్క్‌ను హిట్-2 మూవీ చాలా తక్కువ సమయంలో టచ్ చేసిందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వాల్ పోస్టర్ సినిమాపై నేచురల్ స్టార్ నాని
నిర్మించిన ఈ సినిమా త్వరలోనే మిలియన్ డాలర్ క్లబ్లో చేరుతుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి
హీరోయిన్గా నటించగా, హర్షవర్దన్, రావు రమేష్, కోమలి ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.