‘హిట్’ రివ్యూ

విశ్వక్ సేన్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్’ మూవీ రివ్యూ..

10TV Telugu News

విశ్వక్ సేన్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్’ మూవీ రివ్యూ..

‘ఫలక్‌నూమా దాస్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ హీరోగా.. నేచురల్ స్టార్ నాని, డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్’ అనే థ్రిల్లర్ మూవీ నిర్మించాడు.. ఆడియన్స్ టీజర్స్, ట్రైలర్స్, స్నీక్ పీక్ తోటి మంచి క్రేజ్ సంపాదించుకుంది. రాజమౌళి, అనుష్క, రానా వంటి సెలబ్రెటీస్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. పైగా నాని బ్యానర్ (వాల్ పోస్టర్ సినిమా) నుంచి వస్తున్న రెండో సినిమా కావడంతో.. భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇన్ని అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చిన ‘హిట్’ సినిమా విశ్వక్ సేన్ ఖాతాలో మరో హిట్‌గా నిలిచిందా.. నాని నిర్మాతగా సెకండ్ హిట్ కొట్టినట్టేనా? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :
క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌‌లో హోమ్‌సైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్ ఒక బాగం, ఆ వింగ్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా పని చేసే విక్రమ్, తన పాత జ్ఞాపకాలతో మెంటల్ ట్రెస్‌తో బాధపడుతుంటాడు. నేహా అనే సైంటిఫిక్ ఆఫీసర్, విక్రమ్ ప్రేమించుకుంటారు. విక్రమ్ తన వృత్తిలో భాగంలో క్రైమ్ కేసులను డీల్ చేస్తుంటాడు. ఒక రోజు ప్రీతి అనే అమ్మాయి మిస్సవుతుంది. అదే టైమ్‌లో అతని ప్రియురాలు నేహా కూడా మిస్ అవుతుంది. నేహా కేస్‌ను ఇన్వెస్టిగేట్ చేస్తున్న అన్వేష్.. విక్రమే, నేహాను చంపాడన్న అనుమానం వ్యక్తపరుస్తాడు. 
అయితే ప్రీతి కేస్‌ను హ్యాండిల్ చేస్తున్న విక్రమ్‌కు ఆ కేస్‌లో అనేక విషయాలు తెలుస్తుంటాయి. అసలు ప్రీతి ఎలా మిస్ అయ్యింది. నేహాను ఎవరు కిడ్నాప్ చేశారు. అన్వేష్ అనుమానపడ్డట్టు నేహాను విక్రమే చంపాడా? ఈ మిస్టరీ వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? ఈ కేస్‌ను పరిష్కరించే క్రమంలో విక్రమ్ ఎదుర్కొన్న సవాళ్ళేంటి.. అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే.. 

నటీనటులు :
విశ్వక్ సేన్.. విక్రమ్ పాత్రలో సరిగ్గా సెట్ అయ్యాడు. తన బాడీలాంగ్వేజ్‌తో.. తనదైన డైలాగ్స్‌తో.. ఆడియన్స్‌‌ను మెప్పించాడనే చెప్పొచ్చు. తన గత సినిమాలకంటే.. డిఫరెంట్‌గా ఈ సినిమాలో కనిపించాడు. క్రైమ్ సీన్స్‌ను ఇన్వెస్టిగేట్  చేస్తున్నప్పుడు అతని పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇక రుహానీ శర్మ పెర్ఫామెన్స్‌కు స్కోప్ లేని పాత్ర దక్కినా.. తన పాత్ర  పరిధిమేర బాగానే నటించింది. బ్రహ్మాజీ, షిండే పాత్రలో తనదైన శైలిలో నటించాడు. భానుచందర్‌తో పాటు ఇతర నటీనటులు అందరూ తమ క్యారెక్టర్స్‌కు న్యాయం చేశారు. 

టెక్నీషియన్స్ :
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. డైరెక్టర్ శైలేష్ మొదటి సినిమానే అయినా.. మంచి కథతో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా కథను బాగానే నడిపించాడు. సెకండ్ హాఫ్‌లో మిస్టరీ సీన్స్‌ను బాగా హ్యాండిల్ చేశాడు. కొత్తవాడైనా అన్ని డిపార్ట్ మెంట్స్ పైనా కమాండింగ్ చూపించాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ వినయ్ సాగర్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ అయ్యింది. ముఖ్యంగా ఆర్ఆర్ విషయంలో ప్రతీ సన్నివేశం ఎలివేట్ అయ్యేలా అతను తీసుకున్న జాగ్రత్తలు.. సినిమాకు కలిసొచ్చాయి. 
మణికందన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన బలం.. ప్రతీ ఫ్రేమ్‌ను తనదైన యాంగిల్స్‌లో  చాలా రిచ్‌గా చూపిండంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా డైరెక్టర్ విజన్‌కు తగ్గట్టుగా.. తన కెమెరా పనితనాన్ని చూపించాడు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగ్గట్టుగా బాగున్నాయి. 
ఓవరాల్‌గా : 
‘ఫలక్‌నూమా దాస్’ సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ తన నెక్ట్స్ సినిమా కూడా ఓ లెవల్లో ఉండాలి అని నాని.. ప్రొడక్షన్‌లో చేసిన ‘హిట్’ సినిమా.. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్‌కు విజువల్ ట్రీట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టే అవకాశం పుష్కలంగా ఉంది. 

ప్లస్ పాయింట్స్ 
విశ్యక్ సేన్ నటన 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
స్క్రీన్ ప్లే.. 
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ 
సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ 
తగ్గిన ఎమోషన్.. 

See Also | ‘రాహు’ రివ్యూ

×