The Batman: హాలీవుడ్‌ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే?

ఇండియన్ సినిమాకి ఎసరు పెడుతోంది హాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రతీసారి హాలీవుడ్ సినిమాలు మన మార్కెట్ పై నేషనల్ వైడ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. కరోనా మహమ్మారి పోయి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ..

The Batman: హాలీవుడ్‌ హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌.. ఇండియాలో రిలీజ్ ఎప్పుడంటే?

The Batman

The Batman: ఇండియన్ సినిమాకి ఎసరు పెడుతోంది హాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రతీసారి హాలీవుడ్ సినిమాలు మన మార్కెట్ పై నేషనల్ వైడ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. కరోనా మహమ్మారి పోయి మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకునేలా మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్స్ వస్తుంటే.. వాటిని దెబ్బతీసేలా హాలీవుడ్ మూవీస్ ఇండియన్ స్క్రీన్ పై వాలిపోతున్నాయి. సౌత్, నార్త్ అని తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలతో మన మేకర్స్ ప్లాన్స్ వేస్తుంటే.. వాటిని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ దెబ్బకొడుతున్నాయి.

Hollywood: జేమ్స్ బాండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్.. హాలీవుడ్‌లో సినిమాల జాతర!

మార్వెల్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ సినిమాలకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కారణంగానే వాటిని లోకల్ లాంగ్వేజెస్ ల్లో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. దీంతో ప్రతీ సీజన్ లోనూ వీటి నుంచి మన సినిమాలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ రీజన్ తోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్లపై హాలీవుడ్ షేర్ ఎఫెక్ట్ బలంగా కనిపిస్తోంది. ఇదే పంథాలో ఇప్పుడు మరో అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ ఒకటి ఇండియన్ తెరలపై వచ్చేందుకు సిద్ధమైంది. అదే ది బ్యాట్ మాన్.

Hollywood Sequel : హాలీవుడ్ సినిమాలకు సీక్వెల్ రెడీ..

ఈ చిత్రాన్ని మ్యాట్‌ రీవ్స్‌ దర్శకత్వంలో వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా.. ఇంతకు ముందు వచ్చిన బ్యాట్‌మ్యాన్‌ చిత్రానికి సీక్వెల్‌. ఈ సీక్వెల్ లో నటుడు రాబర్ట్‌ ప్యాటిన్సన్‌ హీరో-విలన్ రెండు పాత్రల్లో అదరగొట్టాడు. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రాబోతున్న ఈ సినిమాను ఇంగ్లీష్ తో పాటు తమిళం, తెలుగు, హిందీలో కూడా డబ్బింగ్ చేసి ఒకేసారి మార్చి 4న విడుదల చేయబోతున్నారు.