టాలివుడ్ లో హాలివుడ్ సినిమాల హవా!

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 07:24 AM IST
టాలివుడ్ లో హాలివుడ్ సినిమాల హవా!

టాలివుడ్ బాక్సాఫీస్ మీద హాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నేసింది. తెలుగు సినిమా మార్కెట్ ని క్యాష్ చేసుకునేందుకు హాలివుడ్ ఫిల్మ్ మేకర్స్ దొరికిన ప్రతి చిన్న ఛాన్స్ ని వాడుకుంటున్నారు. తెలుగు డైరెక్టర్ కాదు తెలుగు హీరోలు లేరు తెలుగు భాష కాదు అయినా సరే హాలివుడ్ సినిమాలకి టాలివుడ్ లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే హాలివుడ్ సినిమా రిలీజ్ అవుతుందంటే తెలుగు సినిమాలకు సైతం రిలీజ్ ని వాయిదా వేసుకునేంతలా. 

లేటెస్ట్ గా రిలీజైన ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 500లకి పైగా థియేటర్స్ లో రిలీజైంది. మెయిన్ సిటీస్ లో ఉన్న మల్టీప్లెక్సుల్లో వారం రోజులకి టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఐపోయాయి. ఓ ఇంగ్లీష్ సినిమాకి ఇంతలా క్రేజ్ రావడానికి రీజన్ ప్రమోషన్స్ లో ఎక్కడా తగ్గకపోవడమే. 

తెలుగు ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు ఏకంగా హాలివుడ్ డైరెక్టర్ జో రుస్సో స్పెషల్ గా ఇండియాకి వచ్చి సినిమాని ప్రమోట్ చేశాడు. అంతేకాదు ఏఆర్ రెహ్మాన్ తో మార్వెల్ యాంతంని కంపోజ్ చేయించారు. అన్ని భాషల స్టార్ హీరోలతో సినిమాని ప్రమోట్ చేయించారు. 

మే 24న రిలీజ్ కానున్న అల్లాద్దీన్ సినిమాలో అల్లాద్దీన్ క్యారెక్టర్ కి యంగ్ హీరో వరుణ్ తేజ్ తో డబ్బింగ్ చెప్పించారు. జినీ క్యారెక్టర్ చేసిన విల్ స్మిత్ కి సీనియర్ హీరో వెంకటేష్ తో వాయిస్ చెప్పించారు. ఎఫ్ 2 సినిమాతో హిట్టుకొట్టిన ఈ ఇద్దరు హీరోల క్రేజ్ అల్లాద్దీన్ సినిమాకి కలిసొస్తుందని మూవీటీం భావిస్తోంది. ఇలా తెలుగు సినిమా మార్కెట్ పై  హాలివుడ్ సరికొత్త ఎత్తులు వేస్తోంది.