Hollywood Movies : హాలీవుడ్ క్రేజీ సిరీస్ లకి ఎండ్ కార్డ్..

హాలీవుడ్ క్రేజీ సిరీస్ లకి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఇన్నిసంవత్సరాల నుంచి యాక్షన్ లవర్స్ ని ఎంగేజ్ చేస్తున్న సూపర్ హిట్ మూవీ సీక్వెల్స్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేశాయి. ఇప్పటికే హాలీవుడ్...........

Hollywood Movies : హాలీవుడ్ క్రేజీ సిరీస్ లకి ఎండ్ కార్డ్..

Mission Impossible

Hollywood Movies :  హాలీవుడ్ క్రేజీ సిరీస్ లకి ఎండ్ కార్డ్ పడబోతోంది. ఇన్నిసంవత్సరాల నుంచి యాక్షన్ లవర్స్ ని ఎంగేజ్ చేస్తున్న సూపర్ హిట్ మూవీ సీక్వెల్స్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేశాయి. ఇప్పటికే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సిరీస్ అవెంజర్స్ సినిమా.. అవెంజర్స్ ఎండ్ గేమ్ తో సిరీస్ ని బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి క్లోజ్ చేసింది.

హాలీవుడ్ లో మరో క్రేజీ సిరీస్ కూడా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. అమెరికన్ అడ్వెంచరస్ కామెడీ యాక్షన్ సిరీస్ ఇండియానా జోన్స్ సిరీస్ లో లాస్ట్ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలకు ఇన్స్పిరేషన్ అయిన ఇండియానా జోన్స్ మూవీ ఫస్ట్ సిరీస్ రిలీజ్ అయ్యి 40 సంవత్సరాలు దాటిపోయింది. స్టీఫెన్ స్పీల్ బర్గ్ డైరెక్షన్లో ఇంట్రస్టింగ్ ఫిక్షనల్ ఆర్కియాలజీ కంటెంట్ తో ఇప్పటి వరకూ నాలుగే సిరీస్ లు వచ్చినా ప్రతి సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యి నెక్ట్స్ సిరీస్ కోసం ఆడియన్స్ ని వెయిట్ చేసేలా చేసింది ఈ క్రేజీ సిరీస్. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ సినిమా లాస్ట్ సిరీస్ రాబోతోంది. స్టీఫెన్ స్పీల్ బర్గ్ ఫస్ట్ నాలుగు సిరీస్ లు డైరెక్ట్ చేస్తే లాస్ట్ సిరీస్ ని మాత్రం జేమ్స్ మ్యాన్ గోల్డ్ డైరెక్ట్ చేస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మోస్ట్ హిలేరియస్ కామెడీ అడ్వెంచరస్ సినిమా జూన్ 30,2023న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్.

Alia Bhatt : బేబీ రాబోతుంది అంటూ పోస్ట్.. ఆలియా భట్ ప్రగ్నెంట్?.. కంగ్రాట్స్ చెప్తున్న సెలబ్రిటీలు..

ఇండియానా జోన్స్ తో పాటు మరో క్రేజీ హాలీవుడ్ సిరీస్ మిషన్ ఇంపాజిబుల్ కూడా 8సిరీస్ తో ఎండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు టామ్ క్రూజ్. 1996లో స్టార్ట్ అయిన ఈ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ను సూపర్ హిట్ చేస్తూ స్టార్ హీరోగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు టామ్ క్రూజ్. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో 7, 8 సినిమాల్ని బ్యాక్ టూ బ్యాక్ తెరకెక్కిస్తున్న టీమ్ సెవెన్త్ సిరీస్ ని 2023 జులై 14న రిలీజ్ చేస్తుంటే, ఈ సిరీస్ లో లాస్ట్ మూవీని 2024 జూన్ 8న రిలీజ్ చెయ్యడానికి డిసైడ్ అయ్యారు.

Avengers

ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీన్స్ తో హాలీవుడ్ మోస్ట్ ఎంటర్ టైనింగ్ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి కూడా ఎండ్ కార్డ్ పడబోతోంది. హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీజిల్.. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ కి సంబందించి ఇంకా రెండు సిరీస్ లు మాత్రమే రిలీజ్ అవుతాయని10 , 11 పార్ట్స్ తర్వాత ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ని ఎండ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈసిరీస్ లో టెన్త్ పార్ట్ 2023 మేలో రిలీజ్ చెయ్యబోతున్నారు.