Hollywood Movies: ఇండియాలో హాలీవుడ్ హవా.. బాక్సాఫీస్ వద్ద భళా!

ఇండియన్ సినిమాకి ఎసరు పెడుతోంది హాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రతీసారి మన మార్కెట్ పై నేషనల్ వైడ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. కొవిడ్ టైమ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకునేలా మోస్ట్ అవైటైడ్..

Hollywood Movies: ఇండియాలో హాలీవుడ్ హవా.. బాక్సాఫీస్ వద్ద భళా!

Hollywood Movies

Hollywood Movies: ఇండియన్ సినిమాకి ఎసరు పెడుతోంది హాలీవుడ్ ఇండస్ట్రీ. ప్రతీసారి మన మార్కెట్ పై నేషనల్ వైడ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. కొవిడ్ టైమ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ కోలుకునేలా మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్స్ వస్తుంటే.. వాటిని దెబ్బతీసేలా హాలీవుడ్ మూవీస్ ఇండియన్ స్క్రీన్ పై వాలిపోతున్నాయి. దీంతో ప్రతి సీజన్ లోనూ నేషనల్ సినిమాకు బాక్సాఫీస్ వసూళ్లలో తేడా కనిపిస్తోంది.

Hema Malini: రోడ్లను హీరోయిన్ల బుగ్గలతో పోల్చడం.. హేమమాలిని కామెంట్స్!

సౌత్, నార్త్ అని తేడా లేకుండా పాన్ ఇండియా సినిమాలతో మన మేకర్స్ ప్లాన్స్ వేస్తుంటే.. వాటిని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ దెబ్బకొడుతున్నాయి. మార్వెల్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ సినిమాలకు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కారణంగానే వాటిని లోకల్ లాంగ్వేజెస్ ల్లో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. దీంతో ప్రతీ సీజన్ లోనూ వీటి నుంచి మన సినిమాలు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ రీజన్ తోనే బాక్సాఫీస్ వద్ద వసూళ్లపై హాలీవుడ్ షేర్ ఎఫెక్ట్ బలంగా కనిపిస్తోంది.

Samantha Special Song: బాబోయ్.. సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు!

రీసెంట్ రిలీజెస్ నే తీసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప : ది రైజ్` కంటే ఒకరోజు ముందు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ ఇండియాలో రిలీజైంది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధించడమే కాకుండా ఇక్కడి మార్కెట్ ని కూడా ప్రభావితం చేస్తోంది. స్పైడర్ మ్యాన్ ఫస్ట్ డే ఇండియా కలెక్షన్స్ అక్షరాల 37. 67 కోట్లు. ఇది 2021లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఓ డబ్బింగ్ సినిమా సాధించిన భారీ ఓపెనింగ్. అంతేకాదు హాలీవుడ్ క్రేజీ ప్రొడక్షన్ హౌజ్ మార్వెల్స్ నుంచి ఈ ఇయర్ వచ్చిన మూడవ సినిమా ఇది. స్పైడర్ మ్యాన్ బరిలో లేకుంటే పుష్ప కలెక్షన్స్ అతి భారీ లెవెల్లో ఉండేవని ట్రేడ్ వర్గాల అంచనా.

Naina Ganguly: నైనా.. అసలేంటీ అందాల అరాచకం!

`షాంగ్ – చీ`, ఎటర్నల్స్ వంటి సినిమాలు కూడా దేశ వ్యాప్తంగా వసూళ్లని బాగానే రాబట్టాయి. ఈ సినిమాలకు కొంచెం అటు ఇటుగా రిలీజైన అక్షయ్ కుమార్ `సూర్యవంశీ`పై ఆ ప్రభావం పడిందనేది నిజం. ఇప్పుడే కాదు గతంలోనూ హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల హవా ఇండియాలో సంచలనానలే సృష్టించింది. ఇలాంటి రికార్డ్స్ ను దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ సినిమా ఇక్కడ సైలెంట్ గా ఎంట్రీ ఇస్తున్నాయి.

RRR-Radhe Shyam: సంక్రాంతి సినిమాలు.. ఫుల్‌గా ఆర్ఆర్ఆర్.. డల్‌గా రాధేశ్యామ్!

ఈ శుక్రవారం సౌత్ లెవెల్ లో శ్యామ్ సింగ రాయ్.. పాన్ ఇండియా లెవెల్ లో 83 రిలీజ్ కాబోతున్నాయి. రెండు సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇవే ఒకదానికొకటి పోటీ అనుకుంటే.. వీటికి తోడు.. ఇంకా చెప్పాలంటే రెండు రోజుల ముందే ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్ రిలీజ్ కి రెడీఅయింది. ఈ హాలీవుడ్ మూవీలో ప్రియాంక చోప్రా నటించడం మరో ప్లస్ పాయింట్. క్రిస్ మస్ సీజన్ ని క్యాష్ చేద్దామనుకుంటోన్న ది మ్యాట్రిక్స్ 4.. ఇదే సీజన్ కి రాబోతున్న ఇండియన్ సినిమాలపై ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ లేకపోలేదు.

Unstoppable with NBK: బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. స్టార్ హీరోలతో బ్యాక్ టూ బ్యాక్ ఎపిసోడ్స్!

2022లో చాలా హాలీవుడ్ సినిమాలు ఇండియాలో బోణీ కొట్టేందుకు ఎదురుచూస్తున్నాయి. డైరెక్టర్ మాట్ రీవ్స్ దర్శకత్వంలో రాబర్ట్ ప్యాటిన్సన్ హీరోగా రూపొందుతున్న బ్యాట్ మ్యాన్ మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అదే రోజు అక్షయ్ కుమార్, కృతి సనన్ నటిస్తున్న బచ్చన్ పాండేకి బాక్సాఫీసు దగ్గర పోటీ కానున్నాడు బ్యాట్ మ్యాన్.

Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఓటీటీలోకి పండగ తర్వాతే!

ఇండియన్ ఆడియెన్స్ వెయిట్ చేస్తోన్న యాక్షన్ ఫిల్మ్ కేజీయఫ్: చాప్టర్ 2 ఏప్రిల్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. అదే రోజు లాల్ సింగ్ చద్ధా రిలీజ్ అని ప్రకటించారు అమీర్ ఖాన్. అయితే ఈ రెండు సినిమాలకు పోటీ అన్నట్టు.. రంగలోకి ఫెంటాస్టిక్ బీస్ట్స్ దిగబోతున్నారు. ఒక రోజు తేడాలో అంటే ఏప్రిల్ 15న వార్నర్ బ్రదర్స్.. ది సీక్రెట్స్ ఆఫ్ డంబెల్డోర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

Alia Bhatt: అందం, అభినయం కలిసిన రూపం ఈ భట్ బ్యూటీ!

తమిళ బ్లాక్ బస్టర్ విక్రమ్ వేదకి హిందీ రీమేక్ గా వస్తున్న హృతిక్ ప్రాజెక్ట్ సెప్టెంబర్ 30న రిలీజ్ డేట్ ప్రకటించింది. అయితే టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ 7 కూడా అదే రోజున విడుదలకు సిద్ధమైంది. ఇవే కాదు హాలీవుడ్ డబ్బింగ్ సినిమాల లిస్ట్ లో థోర్, డాక్టర్ స్ట్రేంజ్ 2, యాంట్ మ్యాన్, బ్లాక్ పాంథర్, ఆక్వామెన్ లాస్ట్ కింగ్ డం, ది మార్వెల్స్ వంటి చాలా క్రేజీ సినిమాలున్నాయి. ఇండియన్ మార్కెట్ ను క్యాష్ చేస్కోడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.