Hollywood Movies: ముహూర్తం ఫిక్స్.. ఇండియన్ సినిమాలపై హాలీవుడ్ దండయాత్ర!

అసలైన ఆట మొదలైంది. హాలీవుడ్ మోస్ట్ అవైటైడ్ సినిమాల దండయాత్ర ముందు ముందు భీకరంగా ఉండనుంది. ఇండియన్ మార్కెట్ పై విపరీతమైన ప్రభావం చూపించే హాలీవుడ్.. పక్కా స్కెచ్ తో ఒక్కో ప్రాజెక్టును రెడీ చేస్తోంది.

Hollywood Movies: ముహూర్తం ఫిక్స్.. ఇండియన్ సినిమాలపై హాలీవుడ్ దండయాత్ర!

Hollywood Movies (1)

Hollywood Movies: అసలైన ఆట మొదలైంది. హాలీవుడ్ మోస్ట్ అవైటైడ్ సినిమాల దండయాత్ర ముందు ముందు భీకరంగా ఉండనుంది. ఇండియన్ మార్కెట్ పై విపరీతమైన ప్రభావం చూపించే హాలీవుడ్.. పక్కా స్కెచ్ తో ఒక్కో ప్రాజెక్టును రెడీ చేస్తోంది. అయితే ఈసారి సూపర్ సక్సెస్ ల సీక్వెల్స్ హడావిడీ ఎక్కువకావడంతో ముఖ్యంగా బాలీవుడ్ మరింత భయపడుతుంది.

Hollywood Movies: గెట్ రెడీ.. సిద్దమైన హాలీవుడ్ యాక్షన్ విజువల్ ఫీస్ట్!

గత కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాపై హాలీవుడ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతీ సారి మూవీ మార్కెట్ ని దేశ వ్యాప్తంగా ప్రభావితం చేస్తోంది. మార్వెల్, డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి హాలీవుడ్ నిర్మాణ కంపెనీల ప్రాజెక్టులకు ఇండియన్ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ వుంది. ఆ క్రేజ్ కారణంగా వాటిని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేసి వదులడం.. అవి ప్రతీ సీజన్ లోనూ మన సినిమాలకు గట్టి పోటీ ఇస్తూనే ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు బడా ఇండియన్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వసూళ్లని హాలీవుడ్ సినిమాలతో షేర్ చేసుకోవాల్సి వస్తోంది.

Hollywood Movies: ఈఏడాది రానున్న టాప్ హాలీవుడ్ సినిమాలు ఇవి

గతేడాది కొవిడ్ నుంచి కాస్త రిలాక్సేషన్ దొరికాక స్పైడర్ మ్యాన్ – నో వే హోమ్ వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనాన్ని సృష్టించింది. పుష్ప, 83 సినిమాల మార్కెట్ పై స్పైడర్ మ్యాన్ ఎఫెక్ట్ చూపించాడు. లాంగ్ రన్ లో 300 కోట్లకు పైగానే స్పెడర్ మ్యాన్ రాబట్టాడు. అంతకుముందు సూర్యవంశీ లాంటి సినిమాలపై షాంగ్ చీ, ఎటర్నల్స్ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ గట్టి దెబ్బే కొట్టాయి.

Hollywood Movies: ఇండియాలో హాలీవుడ్ హవా.. బాక్సాఫీస్ వద్ద భళా!

స్పైడర్ మ్యాన్ అంత కాదు కానీ రాబర్ట్ పాటిన్ నస్ బ్యాట్ మ్యాన్ గా వచ్చి కొంత వరకు వసూళ్లు రాబట్టాడు. అయితే ఈ హాలీవుడ్ సినిమాల కారణంగా ఎక్కువగా నష్టపోతుంది బాలీవుడ్. లేటెస్ట్ రిలీజ్ ది డాక్టర్ స్ట్రేంజ్ 2 బజ్ కూడా నార్త్ లోనే ఎక్కువగా ఉంది. మార్వెల్ సినిమాలకు కొనసాగింపుగా వస్తున్న డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్ నెస్ పై భారీ అంచనాలే ఉన్నాయి. స్టోరీ లైన్, యాక్షన్ సీక్వెన్స్ అందిపోతాయని ఇప్పటికే బెనెడిక్ట్ కంబర్‌బ్యాచ్ ప్రమోషన్స్ అదరగొట్టాడు.

Hollywood: జేమ్స్ బాండ్ ఇచ్చిన కాన్ఫిడెన్స్.. హాలీవుడ్‌లో సినిమాల జాతర!

రెండేళ్ల నుంచి మిస్ అయిన హంగామాని చూపించబోతున్నారు హాలీవుడ్ స్టార్ హీరోలు. ఈ సమ్మర్ నుంచి మొదలుపెట్టి ఇయర్ ఎండ్ వరకూ అన్ బిలీవబుల్ యాక్షన్, గ్రాఫిక్స్, ఎలివేషన్ తో సరికొత్త ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వబోతోంది హాలీవుడ్. డాక్టర్ స్ట్రేంజ్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ టాప్ మూవీస్ తో ఈ బజ్ కంటిన్యూ అవ్వబోతోంది. యాక్షన్ లవర్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టాప్ గన్ మెవరిక్ మూవీ మే 27న రిలీజ్ అవుతోంది. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న టామ్ క్రూజ్ ఈ హై ఇంటెన్స్ యాక్షన్ టాప్ గన్ సీక్వెన్స్ పై మరింత నమ్మకం పెట్టుకున్నాడు. ఇక మిషన్‌: ఇంపాజిబుల్‌ ఫ్రాంఛైజీలో రాబోతున్న ఏడో మూవీ 2023 జూలై 18కి ఫోకస్ షిఫ్ట్ చేసింది.

YouTube Records: రిలీజ్‌కు ముందే రికార్డులు.. స్టార్ హీరోలకు సోషల్ మీడియా పరీక్ష!

జురాసిక్‌ పార్క్‌ సినిమా సిరీస్‌లో ఆరో భాగంగా వస్తున్న మూవీ జురాసిక్‌ వరల్డ్‌ : డొమినియన్‌. ఈ మూవీ 2022 జూన్‌ 10న రిలీజ్‌ కాబోతోంది. చివరిసారి 2018లో వచ్చిన జురాసిక్‌ వరల్డ్‌ : ఫాలెన్‌ కింగ్‌ డమ్‌కు ఇది సీక్వెల్‌. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది జురాసిక్ వరల్డ్ ట్రైలర్. క్రిస్ ప్రాట్ లీడ్ రోల్ లో కోలిన్ ట్రివోర్ డైరెక్షన్లో తెరకెక్కింది ఈ సినిమా. జూలైలో సూపర్ హీరో థోర్.. లవ్ అండ్ థండర్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ద మోస్ట్ అవెయిటింగ్ థోర్ మూవీగా జులై 8 న రిలీజ్ కాబోతోంది ఈ హాలీవుడ్ మూవీ.

Movie Collections: 1000 కోట్ల క్లబ్.. మళ్ళీ రిపీట్ చేసే స్టార్స్ ఎవరో?

మార్వెల్ సూపర్ హీరో సినిమాల్లో ఎంతో ప్రత్యేకం అనిపించుకుంది.. బ్లాక్ పాంథర్. 2018లో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ షేక్ చేసే వసూళ్లను అందుకుంది. దీంతో దానికి కొనసాగింపుగా మరో మూవీని నిర్మించారు. బ్లాక్ ఫాంథర్ – వకండా ఫరేవర్ గా వస్తున్న న్యూ ప్రాజెక్ట్ నవంబర్ 11న విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే హీరో చద్విక్ బొస్మాన్ కాన్సర్ తో మృతి చెందారు. ఈయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

RGV : ముదురుతున్న లాంగ్వేజ్ వార్.. బాలీవుడ్‌కి ఛాలెంజ్ చేస్తూ మధ్యలో దూరిన ఆర్జీవీ..

ఇక హాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ప్రపంచమంతా ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న సినిమా అవతార్ 2. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కిచిన అవతార్ మొదటి భాగం 2009లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామి సృష్టించింది. దీంతో అవతార్ కు వరుసగా సీక్వెల్స్ సిద్ధం చేసాడు దర్శకుడు జేమ్స్ కెమెరాన్. ‘అవతార్​: ది వే ఆఫ్​ వాటర్’​ పేరుతో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అలాగే ఈ మూవీ ట్రైలర్​ను ‘డాక్టర్​ స్ట్రేంజ్:​ ఇన్​ ది మల్టీవర్స్​ ఆఫ్​ మ్యాడ్​నెస్’​ సినిమాతో ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే అవతార్2 ట్రైలర్ చూసిన వాళ్లు అవాక్కవుతున్నారు. అవతార్ 2ని డిసెంబర్ లో విడుదల చేయనుండగా, అవతార్ 3ని 2023లో విడుదల చేయనున్నారు.

Avatar 2: బాప్ రే.. 160 భాషల్లో అవతార్-2 రిలీజ్!

స్పైడర్ మ్యాన్ సినిమాలకు ఆదరణ ఎంతలా ఉంటుందో తెలిసిందే. దీంతో ఆ కథల్లో కొన్నిటిని యానిమేషన్ చిత్రాలుగా తీసుకొచ్చారు. 2018లో వచ్చిన స్పైడర్ మ్యాన్ ఇన్ టు స్పైడర్ వర్స్ మూవీ పెద్ద హిట్ గా నిలిచింది. దీంతో ఈ యానిమేటెడ్ సిరీస్ కు కొనసాగింపుగా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ మూవీని 2023 జూన్ కి పోస్ట్ పన్ చేశారు.