RRR For Oscars : దయచేసి ‘ఆర్‌ఆర్ఆర్’ని ఆస్కార్స్‌కి గుర్తించండి.. హాలీవుడ్ నిర్మాత!

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్ఆర్'ని భారతీయ ప్రభుత్వం ఆస్కార్స్ కి సపోర్ట్ చేయకపోయినా, హాలీవుడ్ ప్రతినిధులు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం RRR సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఓటర్స్ కోసం లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాని ఇటీవల ప్రముఖ హాలీవుడ్ నిర్మాత 'జాసన్ బ్లమ్' చూశాడు. దీంతో ఈ నిర్మాత తన ట్విట్టర్ ద్వారా..

RRR For Oscars : దయచేసి ‘ఆర్‌ఆర్ఆర్’ని ఆస్కార్స్‌కి గుర్తించండి.. హాలీవుడ్ నిర్మాత!

hollywood producer tweeted about Please mark 'RRR' to the Oscars

RRR For Oscars : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్ఆర్’ని భారతీయ ప్రభుత్వం ఆస్కార్స్ కి సపోర్ట్ చేయకపోయినా, హాలీవుడ్ ప్రతినిధులు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం RRR సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో భాగంగా ఓటర్స్ కోసం లాస్ ఏంజెల్స్ లోని చైనీస్ థియేటర్ లో స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ సినిమా చూసేందుకు విదేశీలు ఎగపడుతున్నారు. ఏ మూవీకి లేని విదంగా ఈ చిత్రం టికెట్ లు అమ్ముడుపోతున్నాయి. ఇక ఈ సినిమాని ఇటీవల ప్రముఖ హాలీవుడ్ నిర్మాత ‘జాసన్ బ్లమ్’ చూశాడు.

Asian Film Awards : ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ నామినేషన్స్ లో RRR, పొన్నియిన్ సెల్వన్ 1..

దీంతో ఈ నిర్మాత తన ట్విట్టర్ ద్వారా.. ‘ఆర్‌ఆర్ఆర్ తప్పకుండా ఆస్కార్ వెళ్తుంది. ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. RRR అవార్డు గెలుచుకున్న బెస్ట్ పిక్ తో నేను వెళ్తాను. దయచేసి ఆస్కార్స్‌కి ఆర్‌ఆర్ఆర్‌ని గుర్తించండి’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి పలువురు హాలీవుడ్ ప్రతినిధులు కూడా ఏకీభవిస్తూ కామెంట్లు చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన RRR టీం.. ‘మేము మిమ్మల్ని గెలుచుకున్నాము అది చాలు అంటూ’ జాసన్ బ్లమ్ కి బదులిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయ్యింది.

కాగా ఆస్కార్స్ కి ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ఆల్రెడీ నామినేషన్ లో నిలిచింది RRR. ఇప్పుడు లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న స్క్రీనింగ్ కి భారీగా రెస్పాన్స్ వస్తుండడంతో బెస్ట్ పిక్చర్ నామినేషన్ కేటగిరీలో కూడా RRR ఎంట్రీ ఇవ్వచ్చు అని హాలీవుడ్ మీడియా కథనాలు రాసుకొస్తుంది. ప్రముఖ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ‘వెరైటీ’ కూడా ఆర్‌ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకొనే అవకాశం ఉంది అంటూ అంచనా వేసింది. ఇక ఈ స్క్రీనింగ్ లో రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరయ్యి.. ఓటర్లతో చిట్ చాట్ నిర్వహిస్తున్నారు. మరి ఈ సినిమా ఆస్కార్ గెలుచుకుంటుందా? లేదా? అనేది చూడాలి.