NTR30 : వరుస అప్డేట్లు ఇస్తున్న కొరటాల.. NTR30కి పని చేయబోతున్న సూపర్ మ్యాన్ మూవీ టెక్నీషియన్..
NTR30 సినిమా కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ ని రంగంలోకి దించుతున్న కొరటాల శివ. సూపర్ మ్యాన్, ట్రాన్స్ఫార్మర్స్ వంటి యాక్షన్ సినిమాలకు వర్క్ చేసిన..

Hollywood Technicians Kenny Bates and Brad Minnich are working for NTR30
NTR30 : RRR చిత్రంతో ఎన్టీఆర్ (NTR) గ్లోబల్ స్థాయిలో ఫేమ్ ని సంపాదించుకున్నాడు. ఈ సినిమా తరువాత తను ఎటువంటి ప్రాజెక్ట్స్ తో రాబోతున్నాడు అని చాలా మంది ఎదురు చూస్తున్న సమయంలో కొరటాల శివతో, ప్రశాంత్ నీల్ తో సినిమాలు అనౌన్స్ చేసి సంచలనం సృష్టించాడు. NTR30 అంటూ కొరటాలతో మొదటిగా సినిమా మొదలు పెట్టిన ఎన్టీఆర్.. ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో కొబ్బరికాయ కొట్టారు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ షూటింగ్ కోసం భారీ సెట్ ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు ఎప్పటికి అప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు.
NTR: అతడిని చూస్తేనే పారిపోయే ఎన్టీఆర్.. అంతలా భయపెట్టేది ఎవరో తెలుసా?
మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ నడి సముద్రంలో భారీ నౌకలో ఉండబోతుంది. దీంతో భారీ షిప్ సెట్ ని నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాన్ని హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ‘కెన్నీ బెట్స్’ (Kenny Bates) డిజైన్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫార్మర్స్ వంటి యాక్షన్ సినిమాకు కెన్నీ బెట్స్ పనిచేశాడు. అలాగే VFX డిజైనర్ కోసం కూడా హాలీవుడ్ అగ్ర టెక్నీషియన్ ని తీసుకు వస్తున్నారు. సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఆక్వా మ్యాన్ వంటి సినిమాలకు VFX డిజైనర్ గా వర్క్ చేసిన ‘బ్రాడ్ మిన్నిచ్’ (Brad Minnich) ఈ చిత్రానికి పని చేయబోతున్నాడు.
Koratala Siva: NTR30 స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల.. ‘సముద్రఘట్టం కాదుగా..’ అంటూ ట్రోలింగ్!
ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్న రత్నవేలు, కొరటాల శివ దగ్గర ఉండి సెట్ నిర్మాణ పనులు చూసుకుంటూనే.. కెన్నీ బెట్స్, బ్రాడ్ మిన్నిచ్ కి యాక్షన్ సన్నివేశం గురించి కూడా వివరిస్తున్నారు. ఈ చిత్రానికి నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నిర్మాణ విలువల్లో ఎక్కడ రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
#BradMinnich will be the VFX supervisor for crucial sequences in #NTR30 💥💥
Get ready for a stunning visual treat on the Big Screens 🤩#NTR30Begins@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/LUdpwNuNFe
— NTR Arts (@NTRArtsOfficial) March 28, 2023