Salaar : అదిరిపోయే అప్‌డేట్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ‘సలార్’ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతోంది..

10TV Telugu News

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కె.జి.యఫ్’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో, హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’.. డార్లింగ్ పక్కన శృతి హాసన్ తొలిసారి కథానాయికగా నటిస్తుండగా.. కన్నడలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు మధు గురుస్వామి విలన్‌గా కనిపించనున్నారు.

Rana Daggubati : రానా రేంజ్ పెరిగింది.. అందుకే అన్ని కోట్లు..

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సలార్’ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారట. టెనెట్, బ్యాట్‌మెన్ సినిమాలకు వాడిన డార్క్ థీమ్ హాలీవుడ్ టెక్నాలజీని ‘సలార్’ కోసం వాడుతున్నారట..

Mahesh Babu House : ఇంటి కోసం అన్ని కోట్లా..!

ప్రభాస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది అంటున్నారు మూవీ టీం. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే కాబట్టి ‘సలార్’ కి సంబంధించి ఏదైనా అప్‌డేట్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. సమ్మర్ స్పెషల్‌గా 2022 ఏప్రిల్ 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..