Tobe Nwigwe : RRR, నాటు నాటు సాంగ్‌ని పొగిడిన ప్రముఖ హాలీవుడ్ ర్యాపర్, ట్రాన్స్ఫార్మర్స్ నటుడు..

ట్రాన్స్ఫార్మర్స్ యూనిట్ ఇండియాకు చెందిన ఓ నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ట్రాన్స్ఫార్మర్స్ నటుడు, హాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ టాబ్ న్విగ్వే మాట్లాడుతూ...

Tobe Nwigwe : RRR, నాటు నాటు సాంగ్‌ని పొగిడిన ప్రముఖ హాలీవుడ్ ర్యాపర్, ట్రాన్స్ఫార్మర్స్ నటుడు..

Hollywood Transformers Actor Tobe Nwigwe praised RRR and Naatu Naatu song

RRR సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కేవలం తెలుగు, ఇండియా ప్రేక్షకులని కాక ప్రపంచమంతటా అని దేశాల్లోని ప్రేక్షకులను RRR సినిమా మెప్పించింది. అంతర్జాతీయంగా పలు అవార్డులు గెలుచుకుంది. ఇక RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే అత్యున్నతమైన ఆస్కార్(Oscar) అవార్డు సైతం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక హాలీవుడ్(Holywood) లోని టాప్ డైరెక్టర్స్, నటులు, టెక్నీషియన్స్ ఎంతోమంది RRR సినిమాను, రాజమౌళిని అద్భుతమైన సినిమా అంటూ అభినందించారు.

RRR సినిమా రిలీజయి సంవత్సరం దాటేస్తున్నా ఇంకా ప్రపంచంలో ఏదో ఒక మూల ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అంతటి చరిత్ర సృష్టించారు రాజమౌళి. తాజాగా మరో హాలీవుడ్ ప్రముఖ ర్యాపర్, నటుడు RRR సినిమాని పొగుడుతూ మాట్లాడాడు. హాలీవుడ్ ట్రాన్స్ఫార్మర్స్ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. యాక్షన్ సినిమా అయిన ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ ది బీస్ట్స్ నేడు రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో గత కొద్ది రోజులుగా బిజీగా ఉన్నారు చిత్రయూనిట్.

Samantha : రాష్ట్రపతిని కలిసిన సమంత & సిటాడెల్ టీం.. ద్రౌపది ముర్ము ఎలాంటి సినిమాలు చూస్తారో తెలుసా?

ప్రమోషన్స్ లో భాగంగా ట్రాన్స్ఫార్మర్స్ యూనిట్ ఇండియాకు చెందిన ఓ నేషనల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ట్రాన్స్ఫార్మర్స్ నటుడు, హాలీవుడ్ ప్రముఖ ర్యాపర్ టాబ్ న్విగ్వే మాట్లాడుతూ.. RRR సినిమా నాకు చాలా బాగా నచ్చింది. కుదిరితే RRR పార్ట్ 2 లో భాగమవ్వాలని ఆశిస్తున్నాను. నాటు నాటు సాంగ్ కూడా చాలా బాగుంది. ఆ పాటకు నేను కూడా స్టెప్పులు వేశాను అని తెలిపాడు. అలాగే పలు బాలీవుడ్ సినిమాల గురించి కూడా మాట్లాడాడు. న్విగ్వేతో పాటు మరో ఇద్దరు హాలీవుడ్ నటులు కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. వారు కూడా RRR సినిమాను అభినందించారు. దీంతో టాబ్ న్విగ్వే RRR పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరోసారి RRR అభిమానులు, ప్రేక్షకులు రాజమౌళిని అభినందిస్తున్నారు.