Hombale Films: 5 ఏళ్లలో మూడు వేల కోట్లు.. హొంబాలే ఫిలింస్ సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్!

ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబాలే ఫిలింస్‌కు 2022 సంవత్సరం బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఈ సంవత్సరంలో ఈ బ్యానర్ నుండి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి. కేజీయఫ్ చాప్టర్ 2, కాంతార చిత్రాలు పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ సక్సెస్‌ను అందుకున్నాయి. కాగా, తాజాగా ఈ ప్రొడక్షన్ కంపెనీ ఓ సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

Hombale Films: 5 ఏళ్లలో మూడు వేల కోట్లు.. హొంబాలే ఫిలింస్ సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్!

Hombale Films To Invest 3000 Cr In Next 5 Years

Hombale Films: ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబాలే ఫిలింస్‌కు 2022 సంవత్సరం బాగా కలిసొచ్చిందని చెప్పాలి. ఈ సంవత్సరంలో ఈ బ్యానర్ నుండి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాయి. కేజీయఫ్ చాప్టర్ 2, కాంతార చిత్రాలు పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ సక్సెస్‌ను అందుకున్నాయి. కాగా, తాజాగా ఈ ప్రొడక్షన్ కంపెనీ ఓ సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ చేసింది.

Hombale Films : KGF నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ మాములుగా లేవుగా..

హొంబాలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ రాబోయే 5 ఏళ్లలో సినిమా రంగంలో రూ.3000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఈ మేరకు అనౌన్స్‌మెంట్ చేశారు. ప్రజల సహకారంతో మరిన్ని మైలురాళ్లు సాధిస్తామని.. తమపై ప్రజలు చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమకు ఈ సంస్థ ధన్యవాదాలు తెలిపింది. తమ సినిమాలను ఆదరిస్తూ తమపై మరింత భాద్యతను పెంచారని విజయ్ పేర్కాన్నారు.

Hombale Films: లేడీ డైరెక్టర్‌ను నమ్ముకున్న కేజీయఫ్ నిర్మాతలు.. ఎందుకో?

ఈ దేశంలో ట్యాలెంట్‌కు కొదవ లేదని.. అలాంటి ట్యాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు తాము ఎంటర్‌టైన్‌మెంట్ సెక్టర్‌లో ఈ మేరకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు విజయ్ తెలిపారు. హొంబాలే ఫిలింస్ చేసిన ఈ అనౌన్స్‌మెంట్‌తో ఈ నిర్మాణ సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇక ఏటా ఈ బ్యానర్ నుండి 3-5 సినిమాలు రావచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. మరి హొంబాలే ఫిలింస్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.