NBK108 : మరోసారి బాలయ్యకి జంటగా హనీ రోజ్..

వీరసింహారెడ్డి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. కాగా ఈ మూవీతో మరోసారి హనీ రోజ్ కలిసి చిందేయబోతున్నాడట బాలయ్య..

NBK108 : మరోసారి బాలయ్యకి జంటగా హనీ రోజ్..

honey rose again pair up with balayya in nbk108

NBK108 : నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ఊచకోత కొస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా వింటేజ్ బాలయ్యని మళ్ళీ అభిమానులకు పరిచయం చేసింది. దీంతో థియేటర్ల వద్ద బాలయ్య మాస్ జాతర జరిగింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.110 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తుంది.

NBK108 : రాయలసీమ కాదు తెలంగాణ కథతో NBK108.. అనిల్ రావిపూడి!

ఇక ఈ సినిమాలో బాలయ్యకి జంటగా శృతిహాసన్, మలయాళ బ్యూటీ హనీ రోజ్ నటించిన విషయం తెలిసిందే. హనీ రోజ్ ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేసి నటనలో మార్కులు కొట్టేయగా, బాలకృష్ణ సరసన కరెక్ట్ గా సెట్ అయ్యింది అంటూ అందరి చేత ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు ఆమెను బాలయ్య తదుపరి సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు నెటిజెన్లు. తాజాగా బాలకృష్ణ 108 సినిమాలో ఈ మలయాళ కుట్టి హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న మేకర్స్ తదుపరి షెడ్యూల్ కి సిద్ధమవుతున్నారు. వీరసింహారెడ్డితో సక్సెస్ ఫుల్ పెయిర్ అనిపించుకున్న బాలయ్య, హనీ రోజ్ ఈ చిత్రంలో కూడా కలిసి నటించబోతున్నారు. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ తెలంగాణ నేపథ్యంతో ఉండబోతుంది అంటూ మొన్న జరిగిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో తెలియజేశాడు అనిల్ రావిపూడి. కాగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు వరుస విజయాలు అందుకున్న బాలయ్య ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలి అని చూస్తున్నాడు. మరి అనిల్ రావిపూడి బాలకృష్ణ ఆశని నెరవేరుస్తాడా? లేదా? చూడాలి.