Krishna : అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు.. సూపర్ స్టార్ కృష్ణకు ఘన సన్మానం..

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ఆవిష్కరణ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దీంట్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రని సినిమా తీసి........

Krishna : అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు.. సూపర్ స్టార్ కృష్ణకు ఘన సన్మానం..

Krishna

Krishna :   హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిన్న ఘనంగా ప్రారంభం అయ్యాయి. జూలై 4, 2022 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరపబోయే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ఆవిష్కరణ కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దీంట్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రని సినిమా తీసి కళ్ళకి కట్టినట్టు చూపించిన సూపర్‌ స్టార్‌ కృష్ణకు సన్మానం చేశారు.

ఏపీ, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, అవంతి శ్రీనివాస్‌తోపాటు నటుడు మోహన్‌ బాబు, నిర్మాతలు అశ్వినీదత్‌, తమ్మారెడ్డి భరద్వాజ, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, కృష్ణ సోదరుడు నిర్మాత ఆదిశేషగిరి రావు పాల్గొన్నారు.

Movie Theater : కూకట్‌పల్లి శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన థియేటర్

ఈ కార్యక్రమంలో కృష్ణ మాట్లాడుతూ… నా చిన్న తనంలో అగ్గి రాముడు సినిమా చూసినప్పుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలిసింది. నేను నటుడు కాక ముందు నుంచి అల్లూరి గురించి చాలా కథలు విన్నాను. ఒకరోజు ఎన్టీఆర్ తదుపరి చిత్రం అల్లూరి సీతారామరాజు అని చదివాను. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఎప్పుడు ఈ చిత్రం తీస్తారా అని ఎదురు చూశాను. ఎవరు సీతారామరాజు సినిమా తీసినా ఆయన చరిత్రని పూర్తిగా తెరకెక్కించడం లేదు అని బాధపడేవాడిని. హీరో అయ్యాక ఎన్నో చిత్రాలు చేశా కానీ ఒక గొప్ప చిత్రం తీయాలనే కోరిక ఉండేది. చివరికి అల్లూరి సీతారామరాజు సినిమా నన్నే వరించింది. నా 100వ సినిమాగా అల్లూరి సీతారామరాజు ఎంచుకుని నేనే నిర్మించాను. ఆ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మీ అందరికీ తెలిసిందే. నేను 365 సినిమాల్లో నటించినా నా ఉత్తమ చిత్రం ఎప్పటికీ అల్లూరి సీతారామరాజే” అని కృష్ణ తెలిపారు.