Hyper Aadi: ఇల్లు.. ఆస్తులు.. ఆది సంపాదన ఎంతో తెలుసా?

బుల్లితెర షోల్లో జబర్దస్త్త్ ఒక సంచలనం. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ కామెడీ షో తిరుగులేకుండా దూసుకుపోతుంది. సామాన్యులను స్టార్స్ ని చేసిన ఈ షోలో కమెడియన్స్ కి ప్రేక్షకులలో..

Hyper Aadi: ఇల్లు.. ఆస్తులు.. ఆది సంపాదన ఎంతో తెలుసా?

Hyper Aadi

Hyper Aadi: బుల్లితెర షోల్లో జబర్దస్త్త్ ఒక సంచలనం. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ కామెడీ షో తిరుగులేకుండా దూసుకుపోతుంది. సామాన్యులను స్టార్స్ ని చేసిన ఈ షోలో కమెడియన్స్ కి ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఇందులో అదిరిపోయే పంచ్ లతో పొట్టచెక్కలయ్యేలా నవ్వించగల హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ బుల్లితెరపైకి దూసుకొచ్చిన హైపర్ ఆది.. జబర్దస్త్ కమెడియన్ గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు.

Rangamarthanda: కృష్ణవంశీ కోసం మెగాస్టార్ గాత్ర దానం!

జబర్దస్త్ లో హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ గురించి మామూలుగా ఉండదు. కేవలం పంచులతో మనస్పూర్తిగా నవ్వించడం హైపర్ ఆదికి వెన్నతో పెట్టిన విద్య. ప్రస్తుం సినిమాలలో కూడా ఆది తన టాలెంట్ నిరూపిస్తున్నాడు. ఇంతగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆది ఆస్తులు వెనకేయడంలో కూడా ముందున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లాలోని సొంత ఊరిలో ఇప్పటికే సుమారు 16ఎకరాలు కొన్న ఆది తాజాగా హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు సన్నిహితుల మాట.

Rajinikanth: నడిస్తే స్టైల్.. మాట్లాడితే కేక.. అసలేంటీ రజనీ మేనియా!

మరి ఇంతగా ఇల్లు, ఆస్తులు వెనకేస్తున్నాడంటే సంపాదన కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా. ఈవెంట్‌ను బట్టి పారితోషికం డిమాండ్‌ చేసే ఆది ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలలో ఒక్క స్కిట్‌కి గానూ లక్షల్లో అందుకుంటాడని చెప్పుకుంటారు. దీన్ని బట్టి టీవీ షోల ద్వారానే ఏడాదికి కోటి రూపాయలకు పైగానే సంపాదిస్తాడని ఇండస్ట్రీ టాక్. ఇది కాకుండా సినిమాల్లోనూ నటిస్తున్న ఆది అక్కడ కూడా గట్టిగానే వెనకేస్తున్నాడని చెప్పుకుంటారు.