‘చపాక్’ సినిమా చూసిన తర్వాత లక్ష్మీ అగర్వాల్ కూతురు ఎలా రియాక్ట్ అయ్యిందంటే?

  • Published By: veegamteam ,Published On : January 16, 2020 / 03:41 AM IST
‘చపాక్’ సినిమా చూసిన తర్వాత లక్ష్మీ అగర్వాల్ కూతురు ఎలా రియాక్ట్ అయ్యిందంటే?

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె తాజాగా నటించిన సినిమా ఛపాక్‌. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన చిత్రమిది. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా చూశాక లక్ష్మి అగర్వాల్ నాలుగేళ్ల కుమార్తె ‘పిహు’ ఎలా స్పందించిందో వెల్లడించింది. 

లక్ష్మి మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక పిహు నన్ను చాలా ప్రశ్నలు అడిగింది.. నేను తను అడిగిన ప్రతీ ప్రశ్నకు సమాధనం ఇచ్చాను. అవన్నీ విన్నాక పిహు నన్ను కౌగిలించుకుని ఎంతో ప్రేమ వ్యక్తం చేసింది. పిహు పుట్టినప్పుడు బిడ్డ నన్ను చూసి దగ్గరకు వస్తుందా? భయపడి ఏడుస్తుందా.. ? అనే ప్రశ్నలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ ఇప్పుడు నన్ను చూడగానే.. పిహు కళ్లలో వెలుగు కనిపిస్తుంది. రోజు చక్కగా నవ్వుతూ వచ్చి కౌగిలించుకుంటుంది. ఇది చాలు నాకు కొండంత బలం ఇవ్వడానికి అని లక్ష్మి తెలిపింది.

అంతేకాదు ఈ చిత్రానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, పుదుచ్చేరి, రాజస్థాన్ ప్రభుత్వాలు సమాజంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్‌ దాడులను నియంత్రించడంలో ప్రజలకు అవగాహన కల్పించేలా ఉన్న సినిమాకు పన్ను నుంచి మినహాయించాం. ప్రజలంతా తమ కుటుంబసభ్యులతో కలిసి ఈ సినిమా చూడాలని భూపెష్ బాగెల్, కమల్ నాథ్ ఇద్దరూ ట్విట్టర్ లో ప్రకటించడం చాలా సంతోషంగా అనిపించిందంటు తెలిపింది.