Movie Collections: ఫస్ట్ డే ఎలా దండుకోవాలి.. ఇదే ఇప్పుడు సక్సెస్ ఫార్ములా!

రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకు ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ డే మీదే.. టాక్ తో సంబంధం లేదు, మాగ్జిమమ్ వసూళ్లు రప్పించాలి.. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఫస్ట్ డేనే భారీగా దండుకోవాలి..

Movie Collections: ఫస్ట్ డే ఎలా దండుకోవాలి.. ఇదే ఇప్పుడు సక్సెస్ ఫార్ములా!

Movie Collections

Movie Collections: రీజనల్ సినిమా నుంచి పాన్ ఇండియా సినిమా వరకు ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్ డే మీదే.. టాక్ తో సంబంధం లేదు, మాగ్జిమమ్ వసూళ్లు రప్పించాలి.. సినిమా హిట్ అయినా.. ఫ్లాప్ అయినా ఫస్ట్ డేనే భారీగా దండుకోవాలి.. ఇప్పుడు ఫస్ట్ డే అనే ఫార్ములా ఫాలో అవుతున్నారు తెలుగు ఫిలిం మేకర్స్. మరి ఈ ఫార్ములాను ఎలా అప్లై చేస్తున్నారు? ఈ ఫార్మలాతో ఎలా గట్టెక్కుతున్నారో చూద్దాం.

Movie Collections: 1000 కోట్ల క్లబ్.. మళ్ళీ రిపీట్ చేసే స్టార్స్ ఎవరో?

ఒకప్పుడు సంవత్సరాలు ఆడేవి సినిమాలు.. ఆ తర్వాత 100 డేస్ ఆడితే సక్సెస్ ఫుల్ మూవీ.. ఆ తర్వాత మహా అయితే వారం పది రోజులే.. అందుకే ఇప్పుడు వసూళ్ల విషయానికొస్తే, ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ కీలకంగా మారాయి.. హిట్, ఫ్లాఫ్ తో సంబంధం లేకుండా, టికెట్ రేట్స్ హైక్ చేసుకుని, అత్యధిక థియేటర్స్ లో, అదనపు షోస్ పెంచుకుని, ఎవరైతే సినిమాను రిలీజ్ చేస్తారో వాళ్లే సినిమాకు పెట్టిన బడ్జెట్ తిరిగి రాబట్టుకోగలరు అని ఇప్పుడు ఫిలిం మేకర్స్ గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ నుంచి లేటెస్ట్ సర్కార్ వారి పాట వరకు చూసుకుంటే ఇదే ఫార్ములా పక్కా ఫాలో అయినట్టు కనిపిస్తోంది.

Beast Closing Collections : తెలుగులో బీస్ట్ క్లోజింగ్ కలెక్షన్స్.. దిల్ రాజుకి భారీ నష్టాలు..

సర్కార్ వారి పాట ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ 75 కోట్లు.. ఇప్పుడు స్టార్ హీరోలు, స్టార్ మేకర్సే కాదు, ఫ్యాన్స్ దృష్టి కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ మీదే.. ఫస్ట్ డే స్టార్ హీరో రేంజ్ ను బట్టే కలెక్షన్స్ ఉంటాయని ఫ్యాన్స్ కూడా గట్టిగా బిలీవ్ చేస్తున్నారు. ఫస్ట్ డే నే రికార్డుల లెక్కలుచూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ ఫస్ట్ డే కలెక్షన్స్ 235 కోట్లతో టాప్ లో ఉన్నాయి. అదే పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన రాధేశ్యామ్ ఫస్ట్ డే కలెక్షన్స్ 71 కోట్లతో లో రేంజ్ లో ఉన్నాయి.. ట్రిపుల్ ఆర్ తర్వాత ప్లేస్ లో ఫస్ట్ డే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాగా సర్కార్ వారి పాట నిలిచింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 53 కోట్లకే పరిమితమైంది ఆచార్య.

RRR Collections : అమెరికా, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామి.. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా..

కోవిడ్ ఎఫెక్ట్ ఫిలిం ఇండస్ట్రీ మీద ఒక రేంజ్ లో పడింది. ఎప్పుడో రిలీజ్ అయిపోతాయనుకున్న సినిమాలు వాయిదా పడటంతో సినిమా బడ్జెట్ పెరిగిపోయింది.. దాంతో ఇండస్ట్రీ అంతా ఒక తాటి మీదకొచ్చి రిలీజ్ కి వారం రోజుల గ్యాప్ వరకు ఏ సినిమా క్లాష్ అవ్వకుండా చూసుకుని, రిలీజ్ డేట్లు సర్దుబాటు చేసుకున్నారు. దాదాపు బడా సినిమాలన్నీ ఇదే బెస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నాయి. మరి ఈ పెద్ద సినిమాల సర్దుబాటు లో బడ్జెట్ మూవీస్ పైన పడింది. చిన్న సినిమాలు సూపర్ హిట్ అయితే తప్ప పెట్టిన బడ్జెట్ వచ్చే పరిస్తితి కనిపించడం లేదు. హిట్ టాక్ వచ్చినా అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా వారం కూడా ఆడలేదు. హిట్ అయితే వారం రోజులు కలెక్షన్సే, అదే ఫ్లాప్ అయితే ఫస్ట్ డే కలెక్షన్సే.. ఢక్కోలు అన్నట్టు తయారైంది చిన్న సినిమాల పరిస్థితి.