Hrithik Roshan : ‘కాంతార’ చూసి చాలా నేర్చుకున్నా.. హృతిక్ రోషన్!

కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన మిస్టికల్ యాక్షన్ డ్రామా సినిమా 'కాంతార'. శాండిల్‌వుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు ఈ సినిమాలోని రిషబ్ నటన చూసి ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాపై మరియు రిషబ్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా..

Hrithik Roshan : ‘కాంతార’ చూసి చాలా నేర్చుకున్నా.. హృతిక్ రోషన్!

Hrithik Roshan comments on kantara

Hrithik Roshan : కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన మిస్టికల్ యాక్షన్ డ్రామా సినిమా ‘కాంతార’. రిషబ్ నటిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అనుకోని రీతిలో పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అందుకొని బొమ్మ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా శాండిల్‌వుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు ఈ సినిమాలోని రిషబ్ నటన చూసి ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

Kantara: హాలీవుడ్‌కి వెళ్తున్న కాంతార.. నిజమేనా?

ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాపై మరియు రిషబ్ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్ కూడా రిషబ్ యాక్టింగ్ కి ఫిదా అయ్యిపోయాడు. అమెజాన్ ప్రైమ్ లో ఉన్న కాంతార హిందీ వెర్షన్ చూసిన హృతిక్.. సినిమాపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. కాంతార సినిమా చూసి చాలా నేర్చుకున్నాను అంటూ కామెంట్స్ చేశాడు.

“సినిమాని అర్థమయ్యేలా చెప్పిన రిషబ్ శెట్టి దర్శకత్వం అమోగం. ఇక ఆయన యాక్టింగ్ అయితే అద్భుతం. ప్రీ క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి ట్రాన్స్‌ఫార్మషన్ చూసి నాకు గూస్‌బంప్స్ వచ్చాయి” అంటూ రిషబ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. కాగా హోంబేలె ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది.