ముహూర్తం కుదిరింది : హృతిక్ – దీపికా జంటగా సినిమా

Hrithik Roshan, Deepika Padukone : ముహూర్తం కుదిరింది. ప్రేక్షకుల కల నిజమవ్వబోతోంది. 15 ఏళ్లుగా ఎంత మంది ప్రయత్నిస్తున్నా.. ఒకటి కాని ఆ జంట ఇప్పుడు కలిసి కనిపించబోతున్నారు. బాలీవుడ్ లో 20 ఏళ్లుగా స్టార్ హీరో హోదాలో ఉన్న ఆ హ్యాండ్సమ్ హంక్, 15 ఏళ్లుగా హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న బ్యూటిఫుల్ భామలు కలిసి సినిమా చెయ్యబోతున్నారు.

ఒక్కోసారి అంతే .. ఎన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కొన్ని కాంబినేషన్స్ సెట్ అవ్వవు. దానికి పర్టిక్యులర్ గా రీజన్స్ ఏం లేకపోయినా .. అలా వర్కవుట్ కావు అంతే. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి హృతిక్ రోషన్, దీపికా పడుకోన్ జంట. కహోనా ప్యార్ తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు హృతిక్. దీపికా కూడా 2016 లో సినిమాల్లోకి వచ్చేసింది. ఇద్దరూ స్టార్లుగా 15 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇద్దరూ కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేదు.

ఎందుకో ఏమో ఇప్పటి వరకూ స్క్రీన్ మీద కలిసి కనిపించని ఈ స్టార్ పెయిర్ ఇప్పుడు సినిమా చెయ్యబోతోంది. ఎప్పుడెప్పుడు ఈ ఇద్దరూ కలిసి సినిమా చూద్దామా అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ఈ ఇద్దరూ. వార్ సినిమాని తెరకెక్కించిన సిద్దార్డ్ ఆనంద్ డైరెక్షన్లో ఫైటర్ టైటిల్ తో నెక్ట్స్ ఇయర్ తెరకెక్కబోయే ఈ సినిమాలో దీపికా హీరోయిన్ గా కనిపించబోతోందని అఫీషియల్ అనౌన్స్ చేశారు. కలలు నిజమవుతాయ అంటూ హృతిక్ తో తన సినిమా కోరిక తీరబోతోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వార్ మూవీ తో కమర్షియల్ గా, కెరీర్ పరంగా మంచి మైలేజ్ ఇచ్చిన సిద్దార్ద్ తో సినిమా చేస్తున్నానని హృతిక్ అనౌన్స్ చేశారు. దేశం కోసం పోరాడే పేట్రియాటిక్ రోల్ లో కనిపించబోతున్నారు హృతిక్ రోషన్. మార్ ఫ్లిక్స్ ప్రొడక్షన్స్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా 2022న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. మరి ఈ మోస్ట్ అవెయింట్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా మీద ఇప్పటినుంచే భారీగా ఎక్స్ పెక్టేషన్స్ మొదలుపెట్టేశారు ఫ్యాన్స్.