Aryan Khan : ఇంకా తేరుకొని ఆర్యన్ ఖాన్… కౌన్సిలింగ్ ఇప్పించనున్న హృతిక్
షారుఖ్ తన కొడుకుకి కౌన్సిలింగ్ ఇప్పించాలి అనుకున్నాడు. ఇందుకోసం మరో హీరో హృతిక్ సాయం తీసుకుంటున్నాడు షారుఖ్. ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు షారుఖ్ కి సపోర్ట్ గా......

Hruthik Aryan
Aryan Khan : ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ ని డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల విచారణ అనంతరం బెయిల్ పై ఆర్యన్ ఖాన్ బయటకి వచ్చాడు. ఈ కేసు బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆర్యన్ బెయిల్‌పై జైలు నుంచి బయటకి వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లిన ఆర్యన్ ఇవాళ్టి వరకు కూడా బయటకి రాలేదు. ప్రస్తుతం ఇంట్లోనే గడుపుతున్నాడు. అయితే ఆర్యన్ మైండ్ ఇంకా ఆ కేసు నుంచి బయటకి రాలేదని తెలుస్తుంది. మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం.
Akhanda : బాలయ్యతో 9 రోజులు దుమ్ములో ఫైట్ చేశాను.. బాలయ్యకి విలన్ అంటే అంత ఈజీ కాదు : శ్రీకాంత్
అందుకే షారుఖ్ తన కొడుకుకి కౌన్సిలింగ్ ఇప్పించాలి అనుకున్నాడు. ఇందుకోసం మరో హీరో హృతిక్ సాయం తీసుకుంటున్నాడు షారుఖ్. ఆర్యన్ అరెస్ట్ అయినప్పుడు షారుఖ్ కి సపోర్ట్ గా పోస్ట్ చేశాడు హృతిక్. గతంలో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసేన్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత ఆర్ఫిన్ ఖాన్ అనే సైకాలజిస్ట్ వద్ద కౌన్సిలింగ్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆర్యన్ ఖాన్‌కు కూడా ఆర్ఫీన్ ఖాన్ ని రిఫర్ చేశాడు హృతిక్. ఆర్యన్ ఖాన్ కి త్వరలోనే ఆర్ఫిన్ ఖాన్ కౌన్సిలింగ్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.
Pooja Hegde: మందు ఎలా కలపాలో చూపించి .. ఆల్కహాల్‌తో స్టెప్పులేసి పూజా హెగ్డే..
షారుఖ్ తన కొడుకుని బయటకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు ఆర్యన్ ని మళ్ళీ మాములుగా చేసి జనాల్లోకి తీసుకురావడానికి కూడా షారుఖ్ బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.