Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సాంగ్ కోసం భారీ సెట్!

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటించినా, కథలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టాడు ఈ హీరో.

Nandamuri Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సాంగ్ కోసం భారీ సెట్!

Huge Budget Lavish Set For Nandamuri Kalyan Ram Devil Movie Song

Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీ ‘అమిగోస్’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్‌లో నటించినా, కథలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు లేకపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీపై పూర్తి ఫోకస్ పెట్టాడు ఈ హీరో.

Kalyan Ram: కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ నుంచి ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ అప్డేట్.. ఎప్పుడు వస్తుందంటే..?

నవీన్ మేడారం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో 21వ చిత్రంగా వస్తుండగా, పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్‌ను వేసిందట చిత్ర యూనిట్. ఈ సాంగ్ కోసం ఏకంగా రూ.3 కోట్ల మేర బడ్జెట్‌ను కేటాయించిందట చిత్ర నిర్మాతలు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సాంగ్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

Kalyan Ram: కీలక షెడ్యూల్‌ను ముగించేసిన కళ్యాణ్ రామ్ ‘డెవిల్’!

ఇక ఈ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఎల్నాజ్ నోరౌజీ చిందులేయనుండగా, బృందా మాస్టర్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేయనున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోందట.