Pushpa : పుష్ప సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా భారీ కలెక్షన్స్..ఫస్ట్‌ డే రూ.70కోట్లు వసూల్

ఈ రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించడం తమ సంస్థకు గర్వకారణమన్నారు నిర్మాత ఎర్నేని నవీన్. తెలంగాణలో కూడా అదనపు షోకు పర్మిషన్ ఇవ్వడం తమకు కలిసొచ్చిందన్నారు నిర్మాతలు.

Pushpa : పుష్ప సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా భారీ కలెక్షన్స్..ఫస్ట్‌ డే రూ.70కోట్లు వసూల్

Pushpa

Huge collections for Pushpa Cinema : పుష్ప సినిమా వరల్డ్‌ వైడ్‌గా కలెక్షన్‌ కింగ్‌గా నిలుస్తోంది. ఫస్ట్‌ డే కలెక్షన్లలో రికార్డ్ సృష్టించింది. సినిమా కోసం థియేటర్ల దగ్గర ప్రేక్షకుల రద్దీ తగ్గడం లేదు. విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబడుతోందన్నారు నిర్మాతలు. ఫస్ట్ డే అన్ని లాంగ్వేజెస్‌ కలిపి 70 కోట్ల రూపాయలు వసూల్ చేసింది పుష్ప.

ఈ రేంజ్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించడం తమ సంస్థకు గర్వకారణమన్నారు నిర్మాత ఎర్నేని నవీన్. ఈ నంబర్స్ తాము ఊహించలేదన్నారు. తెలంగాణలో కూడా అదనపు షోకు పర్మిషన్ ఇవ్వడం తమకు కలిసొచ్చిందన్నారు నిర్మాతలు. వీకెండ్ కావడంతో ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయని నవీన్ అన్నారు.

MLA Rajasingh : ‘దేవిశ్రీ ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి’.. హైదరాబాద్‌ సీపీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ

నైజాంలో తొలిరోజు పుష్పకు 11కోట్ల 44లక్షలు వచ్చింది. సీడెడ్‌లో 4కోట్ల 20లక్షలు, ఉత్తరాంధ్రలో కోటి 80లక్షలు సాధించింది పుష్ప. ఇక తూర్పుగోదావరిలో కోటి 43 లక్షలు, పశ్చిమగోదావరిలో కోటిన్నర, గుంటూరులో 2కోట్ల 28లక్షలు, కృష్ణాలో కోటీ 15లక్షల గ్రాస్‌ను సాధించింది పుష్ప.. నెల్లూరులోనూ కోటీ 10లక్షల వసూళ్లు రాబట్టింది.

మొత్తంగా చూస్తే ఏపీ, తెలంగాణల్లోనే 35కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. ఇక కర్ణాటకలో 3.65కోట్లు వచ్చాయి. తమిళనాడులో తొలిరోజు 1.82 కోట్లు, కేరళలో 1.21కోట్ల రూపాయలు వచ్చాయి. హిందీలోనూ తొలిరోజు కోటీ 66లక్షలు పుష్ప ఖాతాలో చేరాయి. ఇక ఓవర్‌సీస్‌లో పుష్ప.. 4కోట్ల 25లక్షలు తొలిరోజు వసూలు చేసింది.

CM KCR : తెలంగాణలో కొత్త జోనల్ ప్రకారమే ఉద్యోగుల విభజన : సీఎం కేసీఆర్

నైజాంలో తొలిరోజు పుష్పకు రూ.11.44 కోట్లు
సీడెడ్‌లో రూ.4.20కోట్లు
ఉత్తరాంధ్రలో రూ.1.80కోట్లు
తూర్పుగోదావరిలో రూ.1.43కోట్లు
పశ్చిమగోదావరిలో రూ.1.50 కోట్లు
గుంటూరులో రూ.2.28 కోట్లు
కృష్ణాలో రూ.1.15కోట్లు
నెల్లూరులోనూ రూ.1.10 కోట్లు
ఏపీ, తెలంగాణల్లోనే రూ.35కోట్లు
కర్ణాటకలో నూ.3.65కోట్లు
తమిళనాడులో తొలిరోజు రూ.1.82 కోట్లు
కేరళలో రూ.1.21కోట్లు