Dasara Movie: నాని సినిమాకు అక్కడ ఫుల్ డిమాండ్.. కెరీర్‌లోనే రికార్డు బిజినెస్!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ పాన్ ఇండియా మూవీగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ మూవీలో నాని ఊరమాస్ అవతారంలో రెచ్చిపోయి నటించడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Huge Demand For Dasara Movie In Kannada
Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ పాన్ ఇండియా మూవీగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ మూవీలో నాని ఊరమాస్ అవతారంలో రెచ్చిపోయి నటించడంతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
Dasara Movie : దసరా రిలీజ్ కూడా సరికొత్త రికార్డు.. అమెరికాలో భారీగా..
ఇక ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తూ సందడి చేస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ దసరా మూవీని భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ చేస్తోంది చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమాకు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అదిరిపోయే క్రేజ్ దక్కడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి రెస్పాన్స్‌ను అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమాకు కన్నడనాట విపరీతమైన క్రేజ్ నెలకొందని.. ఈ సినిమా రైట్స్ కోసం అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ భారీ రేటును ఆఫర్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Dasara : ఆ సీన్ నన్ను చాలా భయపెట్టింది.. రెండు నెలలు చాలా ఇబ్బంది పడ్డాను.. నాని!
ఇది నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా రానుందని.. ఈ సినిమాతో నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమాను కన్నడలో ఎవరు రిలీజ్ చేస్తారా.. అక్కడ ఈ సినిమా ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందా.. రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అనే విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. దసరా మూవీలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.