Varisu: ‘వారసుడు’కి గట్టి పోటీనిస్తున్న సీనియర్ హీరోలు!

సంక్రాంతి సీజన్‌లో సినిమాల సందడి ఎలా ఉంటుందో, అభిమానుల కోలాహలం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సంక్రాంతి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ హోరాహోరీగా సాగనుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు హీరోలు కర్చీఫ్‌లు వేసుకుని సీట్ రిజర్వ్ చేసుకున్నారు.

Varisu: ‘వారసుడు’కి గట్టి పోటీనిస్తున్న సీనియర్ హీరోలు!

Huge Pressure On Vijay Varisu From Senior Heroes

Varisu: సంక్రాంతి సీజన్‌లో సినిమాల సందడి ఎలా ఉంటుందో, అభిమానుల కోలాహలం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఈ సంక్రాంతి కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ హోరాహోరీగా సాగనుంది. ఇప్పటికే సంక్రాంతి బరిలో తమ సినిమాలు రిలీజ్ చేసేందుకు హీరోలు కర్చీఫ్‌లు వేసుకుని సీట్ రిజర్వ్ చేసుకున్నారు.

Varisu : దళపతి కోసం పాట పాడడమే కాదు కాలు కూడా కలిపిన శింబు.. మాములుగా లేదుగా పాట!

అయితే ఈ సంక్రాంతికి పోటీపడుతున్న ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమాలపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. కాగా, ఈ ఇద్దరు తెలుగు హీరోలకు ఓ తమిళ హీరో కూడా పోటీనిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో దిగుతుండగా, నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గా కదం తొక్కేందుకు రెడీ అయ్యాడు. ఈ రెండు సినిమాలు కూడా తెలుగు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. ఇక ఈ సినిమాల ప్రమోషన్స్‌ను కూడా అదిరిపోయే లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Varasudu : వారసుడు డేట్ ఇచ్చేశాడుగా.. అస్సలు తగ్గనంటున్న దిల్ రాజు..

కాగా, తమిళ హీరో విజయ్ నటిస్తున్న వారిసు చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఏర్పడనుంది. వారసుడు వస్తున్న రోజునే వీరసింహారెడ్డి రావడం.. ఆ తరువాత రోజున వాల్తేరు వీరయ్య కూడా దిగుతుండటంతో, వారసుడు ఖచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకు పబ్లిక్ టాక్ ఏమాత్రం అటుఇటుగా ఉన్నా, థియేటర్లను కోల్పోయే ప్రమాదం ఉందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరి దిల్ రాజు ఈ సినిమాపై నమ్మకంతో భారీ సంఖ్యలో థియేటర్స్‌ను బుక్ చేసి ఉండటంతో.. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.