NTR30: తారక్ కోసం రెడీ అవుతోన్న భారీ సెట్.. యాక్షన్‌తోనే బరిలోకి దిగుతాడా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పట్టాలెక్కిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకడు కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అనౌన్స్ చేసి రోజులు గడుస్తున్నా, ఇంకా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు పట్టాలెక్కిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఫిబ్రవరి నుండి ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేసింది.
NTR30: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. NTR30 షూటింగ్ వర్క్స్ స్టార్ట్!
అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే చిత్ర యూనిట్ ఓ భారీ సెట్‌ను ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ సెట్‌లోనే ఎన్టీఆర్ 30వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సెట్‌లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక ఈ షూటింగ్ షెడ్యూల్‌లో తారక్‌తో పాటు పలువురు కీలక నటీనటులు కూడా పాల్గొనబోతున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
NTR30: తారక్ కోసం బరిలోకి దిగుతున్న బాలీవుడ్ విలన్..?
మరి నిజంగానే ఈ భారీ సెట్‌లో షూట్ చేయబోతున్న యాక్షన్ ఎపిసోడ్ వెండితెరపై ఎలాంటి పూనకాలు తెప్పిస్తుందా అని అభిమానులు అప్పుడే ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనేది తెలియాల్సి ఉంది.