NBK108: వినాయకుడి పూజలు చేస్తున్న బాలయ్య.. ఏకంగా 5 కోట్ల ఖర్చు!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. NBK108 మూవీలో ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

NBK108: వినాయకుడి పూజలు చేస్తున్న బాలయ్య.. ఏకంగా 5 కోట్ల ఖర్చు!

Huge Set Of Rs 5 Cr For NBK108 Song Shoot

NBK108: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న NBK108 మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నటసింహం బాలయ్య నెవర్ బిఫోర్ లుక్స్‌లో కనిపిస్తుండగా, ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.

NBK108: శ్రీలీలకు బాలయ్య తండ్రి కాదట.. ఏమవుతాడో తెలుసా?

ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, తాజాగా ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంగ్ సినిమాలో ఇంట్రొడక్షన్ సాంగ్‌గా రాబోతందట. ఇక ఈ సాంగ్‌లో బాలయ్య వినాయకుడి పూజలు చేస్తూ మనల్ని ఆకట్టుకుంటాడట. కాగా, ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేశారట చిత్ర యూనిట్. ఈ సెట్‌ను ఏకంగా రూ.5 కోట్ల భారీ బడ్జెటో నిర్మించినట్లుగా తెలుస్తోంది.

NBK108: అఫీషియల్.. దసరాకు ఆయుధపుజ చేయనున్న బాలయ్య.. పూనకాలు తెప్పిస్తానంటోన్న అనిల్ రావిపూడి

కేవలం ఒక సాంగ్‌కే రూ.5 కోట్ల సెట్ వేశారంటే, ఈ సినిమాను ఏస్థాయిలో చిత్ర యూనిట్ ప్రెస్టీజియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడీగా నటిస్తుండగా, యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్యకు కూతురి పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.