Hanuman : హనుమాన్ సినిమాకి వీఎఫ్ఎక్స్ చేసింది హాలీవుడ్ లో కాదు.. హైదరాబాద్ లోనే ఏ కంపెనీనో తెలుసా??

హనుమాన్ టీజర్ రిలీజ్ అయ్యాక మరింత ట్రోల్ చేశారు. 25 కోట్ల బడ్జెట్ లో హనుమాన్ సినిమా వాళ్ళు అద్భుతమైన గ్రాఫిక్స్ చేశారు అంటూ ఆదిపురుష్ టీంని విమర్శించారు, ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ ని. అయితే హనుమాన్ గ్రాఫిక్స్ చూశాక ఆదిపురుష్ లాగా ఇదెక్కడో హాలీవుడ్ లో చేపించింది..........

Hanuman : హనుమాన్ సినిమాకి వీఎఫ్ఎక్స్ చేసింది హాలీవుడ్ లో కాదు.. హైదరాబాద్ లోనే ఏ కంపెనీనో తెలుసా??

Hyderabad VFX Company Designed graphics for Hanuman movie

Hanuman :  తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమా హనుమాన్. ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి అందర్నీ మెప్పించింది. ఈ టీజర్ ని ఆదిపురుష్ టీజర్ తో పోలుస్తూ ఇదే చాలా బాగుందంటూ అందరూ అభినందించారు. 400 కోట్ల అభారీ బడ్జెట్ పెట్టి, హాలీవుడ్ లో గ్రాఫిక్స్ చేపించిన ఆదిపురుష్ ని దేశమంతటా ట్రోల్ చేశారు టీజర్ రిలీజ్ అయ్యాక.

ఇక హనుమాన్ టీజర్ రిలీజ్ అయ్యాక మరింత ట్రోల్ చేశారు. 25 కోట్ల బడ్జెట్ లో హనుమాన్ సినిమా వాళ్ళు అద్భుతమైన గ్రాఫిక్స్ చేశారు అంటూ ఆదిపురుష్ టీంని విమర్శించారు, ముఖ్యంగా డైరెక్టర్ ఓం రౌత్ ని. అయితే హనుమాన్ గ్రాఫిక్స్ చూశాక ఆదిపురుష్ లాగా ఇదెక్కడో హాలీవుడ్ లో చేపించింది అని అనుకున్నారు కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ అంతా హైదరాబాద్ లోనే ఓ హైదరాబాద్ కంపెనీలోని చేశారు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Kashmir Files : చల్లారిన కశ్మీర్ ఫైల్స్ వివాదం.. క్షమాపణలు చెప్పిన IFFI జ్యూరీ హెడ్ నదవ్ లాపిడ్

హనుమాన్ సినిమాకి హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌ అందిస్తుంది హైదరాబాద్‌కు చెందిన హాలో హ్యూస్ VFX స్టూడియోస్. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ లో ఈ రేంజ్ గ్రాఫిక్స్ అందించే స్టూడియోస్ ఉన్నాయా అని. దీంతో టాలీవుడ్ వర్గాలు ఆ VFX కంపెనీ కోసం ఆరా తీస్తున్నాయట. అలాగే హైదరాబాద్ లోనే ఇంత బాగా చేపిస్తే ఆదిపురుష్ హాలీవుడ్ కి వెళ్లి ఏం చూపించింది అని మరోసారి ట్రోల్ చేస్తున్నారు.