Hyper Aadi : ఢీ షో కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా అని అడిగారు.. హైపర్ ఆది!

హైపర్ ఆది.. తెలుగు వారిలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఇక ఇటీవల రాజకీయంగా కూడా హైపర్ ఆది పేరు తెగ వినిపిస్తుంది. తాజాగా మరోసారి ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Hyper Aadi : ఢీ షో కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా అని అడిగారు.. హైపర్ ఆది!

Hyper Aadi pawan kalyan

Hyper Aadi : హైపర్ ఆది.. తెలుగు వారిలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఇక ఇటీవల రాజకీయంగా కూడా హైపర్ ఆది పేరు తెగ వినిపిస్తుంది. తాజాగా మరోసారి ఆది చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ స్టార్ కమెడియన్ ప్రస్తుతం ‘సార్’ అనే బై లింగువల్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తమిళ స్టార్ హీరో ధనుష్ పక్కన నటించే అవకాశం కొట్టేశాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ మూవీని నిర్మిస్తున్నాడు.

Hyper Aadi : హరిహర వీరమల్లు కోసం వర్క్ చేస్తున్నాను.. పవన్‌కి డబ్బంటే ఆసక్తి లేదు..

ఫిబ్రవరి 17న తెలుగు, తమిళంలో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని ఫిబ్రవరి 8న హైదరాబాద్ లో నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ధనుష్, సంయుక్త మీనన్, హైపర్ ఆది, వెంకీ అట్లూరి, నాగవంశీ హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో హైపర్ ఆది మాట్లాడుతూ.. ఒక పాన్ వరల్డ్ యాక్టర్ అయిన ధనుష్ గారి పక్కన నటించే అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ధనుష్ గారి ‘రఘువరన్ BTech’ తెలుగు వారికి ఎంత నచ్చిందో, ఇప్పుడు ఈ ‘సార్’ కూడా అంతే నచ్చుతుంది. అలాగే హీరోయిన్ సంయుక్త మీనన్ గారు చాలా హార్డ్ వర్కర్. తెలుగు సినిమాలు కోసం కష్టపడి తెలుగు నేర్చుకున్నారు. ప్రెజెంట్ ఆవిడ నటించిన సినిమాలు అన్ని హిట్ అయిపోతున్నాయి. ఇది కూడా అలానే హిట్ అవుతుంది.

ఇక మా నిర్మాత నాగవంశీ.. అయన చాలా జెన్యూన్ పర్సన్. ముక్కుసూటిగా మాట్లాడతారు. దానికి ఒక ఉదాహరణ చెబుతూ మీకు.. భీమ్లా నాయక్ లో నేను ఒక సాంగ్ లో నటించా. అప్పుడు ఢీ షూటింగ్ కోసం ఒక హాఫ్ డే వాళ్ళు రమ్మని అడిగారు. ఆ విషయం నాగవంశీ గారికి చెప్పాను. ఎవరైన ఏమి చెబుతారు.. ఇది కొంచెం ఇంపార్టెంట్ కుదరదు అని అంటారు. కానీ ఆయన ముక్కుసూటి వ్యక్తి కదా, ఏమన్నాడో తెలుసా.. ఢీ షో కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా డిసైడ్ చేసుకోమన్నారు. ఆ ఒక్క మాటకి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని భీమ్లా నాయక్ షూటింగ్ కి వెళ్ళిపోయాను అని సరదాగా చెప్పుకొచ్చాడు.