Hyper Aadi : 25 నిమిషాలకి అదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకున్న హైపర్ ఆది

టీం లీడర్ గా మారి ఒక వైపు జబర్దస్త్, ఢీ లాంటి షోలతో ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. బుల్లి తెరపై హైపర్ ఆది కి మంచి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ తో బయట ఈవెంట్లు, స్పెషల్ షోలు

Hyper Aadi : 25 నిమిషాలకి అదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకున్న హైపర్ ఆది

Adi

Hyper Aadi :  బుల్లితెరపై రైటర్ గా తన ప్రయాణం మొదలు పెట్టి జబర్దస్త్ లో కమెడియన్‌ ఎంట్రీ ఇచ్చి టీం లీడర్ గా మారి ఒక వైపు జబర్దస్త్, ఢీ లాంటి షోలతో ఇంకోవైపు సినిమాలతో బిజీగా ఉన్నాడు హైపర్ ఆది. బుల్లి తెరపై హైపర్ ఆది కి మంచి క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ తో బయట ఈవెంట్లు, స్పెషల్ షోలు కూడా చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కమెడియన్ మాత్రమే కాక రైటర్ కూడా అవ్వడంతో హైపర్ ఆదికి మరింత కలిసి వచ్చింది.

ఇక బిగ్ బాస్ సీజన్ 5 సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్ కి స్పెషల్ గెస్ట్ లను తీసుకొస్తారు బిగ్ బాస్ నిర్వాహకులు. అంతేకాక పెద్ద సినిమాల ప్రమోషన్స్ కూడా చేస్తారు. దీంతో ఆ సినిమా టీంని కూడా గెస్ట్ లుగా తీసుకొచ్చినట్టు అవుతుంది. ఇటీవల నవరాత్రి ఉత్సవాల పేరుతో ఆదివారం బిగ్‌బాస్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌ను నిర్వహించారు. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో హీరోయిన్‌ అఖిల్‌, పూజ హెగ్డే లను తీసుకొచ్చారు. అంతే కాక హీరోయిన్స్ మీనాక్షి, హెబ్బా పటెల్‌ తో స్పెషల్ డ్యాన్స్‌ పర్ఫామెన్స్‌ లను పెట్టించారు. దీనితో పాటు కామెడీ కూడా ఉండేందుకు బిగ్‌బాస్‌ నిర్వహకులు హైపర్ ఆదిని తీసుకువచ్చారు.

Mohanbabu vs Chiranjeevi : ఇండస్ట్రీ పెద్ద ఎవరు?? మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి..

పోలీసు ఆఫీసర్‌గా బిగ్‌బాస్‌ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు ఆది. పోలీసు ఆఫీసర్‌గా వచ్చి బిగ్‌బాస్‌ హౌజ్‌మెట్స్‌పై ఇన్వెస్టిగేషన్‌ చేశాను అంటూ హౌజ్‌లో ఎవరెవరు ఏం చేశారు, ఎలా ఆడుతున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారో అన్నీ చెపుతూ తన కామెడీ టైమింగ్ తో కంటెస్టెంట్స్ పై పంచ్‌లు, సెటైర్లు వేశాడు. అలా తాను ఉన్న25 నిముషాలు అందర్నీ ఫుల్ గా నవ్వించాడు ఆది. అయితే ఈ 25 నిమిషాలకి ఆది భారీగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నాడట. కేవలం 25 నిమిషాలు కనిపించినందుకే దాదాపు 2 లక్షల రూపాయల వరకు తీసుకున్నట్టు సమాచారం. 25 నిమిషాలకి 2 లక్షలు అంటే ఆది తన క్రేజ్ ని బాగానే క్యాష్ చేసుకుంటున్నాడని అర్ధమవుతుంది.