Hyper Aadi : త్రివిక్రమ్ రేంజ్ లో త్రివిక్రమ్ మీదే స్పీచ్ ఇచ్చిన హైపర్ ఆది..

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో పొగిడేసాడు. త్రివిక్రమ్ గురించి త్రివిక్రమ్ రేంజ్ లోనే పొగిడాడు. అలాగే పవన్ కళ్యాణ్ ని, త్రివిక్రమ్ గారిని కూడా కలిపి పొగిడాడు. హైపర్ ఆది మాట్లాడుతూ..............

Hyper Aadi : త్రివిక్రమ్ రేంజ్ లో త్రివిక్రమ్ మీదే స్పీచ్ ఇచ్చిన హైపర్ ఆది..

Hyper Aadi speech in Dhanush Sir Movie Pre Release event he praise trivikram srinivas goes viral

ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న బైలింగ్వల్ సినిమా సార్. తమిళ్ లో వాతిగా తెరకెక్కుతున్న సినిమా తెలుగులో సార్ గా రానుంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఈ సినిమా తమిళ్, తెలుగు భాషలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ధనుష్ అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. చిత్రయూనిట్ ప్రస్తుతం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే ట్రైలర్ లాంచ్, ఆడియో లాంచ్, ప్రెస్ మీట్ లు నిర్వహించగా తాజాగా సార్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఫిబ్రవరి 15 సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ధనుష్ తో పాటు చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైపర్ ఆది త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో పొగిడేసాడు. త్రివిక్రమ్ గురించి త్రివిక్రమ్ రేంజ్ లోనే పొగిడాడు. అలాగే పవన్ కళ్యాణ్ ని, త్రివిక్రమ్ గారిని కూడా కలిపి పొగిడాడు. హైపర్ ఆది మాట్లాడుతూ.. ఒక మంచి అరిటాకు వేసి ఫుల్ మీల్స్ పెట్టి చాలా బాగుండే భోజనం లాగే ఉంటుంది ఈ సినిమా. చాలా బాగుంటుంది ఈ సినిమా. ఇందులో స్టార్ యాక్టర్స్ తో వర్క్ చేయడం నా అదృష్టం. ఈ సినిమా చూశాకా సంయుక్త అందరికి ఫేవరేట్ హీరోయిన్ అయిపోయింది. ధనుష్ గారి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీకి చాలా థ్యాంక్స్. సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక పెద్ద సంస్థగా మారుతుంది. నా ఆల్ టైం ఫేవరేట్ డైరెక్టర్ త్రివిక్రమ్. నా ఇన్‌స్పిరేషన్ త్రివిక్రమ్ గారు సినిమాలతోనే కాదు స్పీచ్ లతో కూడా అయన అందర్నీ మెప్పిస్తారు. ఒక డైరెక్టర్ సినిమాలో సీన్, డైలాగ్స్, సినిమాని పదేపదే చూసేలా చేయగలరు కానీ ఆయన ఒక స్టేజి మీద ఇచ్చే స్పీచ్ కూడా పదేపదే చూడగలిగేలా చేసే ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. మీరు సిరివెన్నెల గారిపై మాట్లాడిన స్పీచ్ చరిత్రలో ఇంకెవరు అలాంటి స్పీచ్ ఇవ్వలేరు సర్. అది నేను నమ్ముతాను. ఒక డైరెక్టర్ కి ఒక హీరోకి ఉన్నంత క్రేజ్ ఉందంటే ఆయన రాసిన మాటల ప్రభావం అలాంటిది, ఆ మాటల ప్రవాహం అలాంటిది. మాటలకు మనిషి రూపం వస్తే అది మాట్లాడే మొదటి మాట థ్యాంక్ యు త్రివిక్రమ్ గారు. ప్రాసకు ఆశ కలిగి ఎవరైనా మొదటి సారి చూడాలి అనుకుంటే అది చూసే మొదటి ఫేస్ త్రివిక్రమ్ గారిది. అయన ఒక సినిమా చేసేటప్పుడు సినిమా విలువ కంటే సినిమాలో రాసే విలువలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే కుటుంబం తాలూకు విలువలు లేకుండా ఒక్క సినిమా కూడా ఆయన తీయడు. అత్తారింటికి దారేది సినిమాలో అత్త మీద చూపించే ప్రేమ కానీ, నువ్వే నువ్వే సినిమాలో తండ్రి కూతురు మీద చూపించే ప్రేమ కానీ.. ఇలా ఏ సినిమాలోనైనా వ్యాల్యూస్ తగ్గకుండా తీస్తారు ఆయన. నాకు తెలిసి ఒక వైట్ పేపర్ కి న్యాయం చేయగలిగే ఏకైక రైటర్ త్రివిక్రమ్ గారు. నా లాంటి వాళ్ళు ఎంత రాసినా ఆ పేపర్ ఇంకేదో కావాలని కోరుకుంటుంది. అదే త్రివిక్రమ్ గారు ఆ పేపర్ మీద పెన్ను పెడితే ఇది కదా నేను కోరుకున్నది అని ఆ పేపర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుద్ది. మీ అందరూ ఖలేజా సినిమా థియేటర్లో చూసి యావరేజ్ అన్నారు. కానీ ఆ సినిమాని టీవీలో మళ్ళీ మళ్ళీ చూసి పెద్ద హిట్ చేశారు. ఒక సినిమా థియేటర్లోంచి వెళ్ళిపోయి టీవీలోకి వచ్చాక కూడా మనం మళ్ళీ మళ్ళీ చూసేలా చేసి ఆ డైరెక్టర్ సరిగ్గానే తీసాడు, మనమే సరిగ్గా తీయలేదు అనేలా చేసాడంటే నిజంగా మనం త్రివిక్రమ్ గారి మీద ఎంత ప్రేమ పెంచుకున్నామో మన అందరికి తెలుసు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా వర్షం పడుతుంటే బజ్జీలు తింటే ఆ కాంబినేషన్ ఎంత బాగుంటుందో, మెగాస్టార్ చిరంజీవి గారు, డ్యాన్స్ ఈ కాంబినేషన్ ఎంత బాగుంటదో, క్రికెట్ లో ధోని, లాస్ట్ బాల్ ఈ కాంబినేషన్ ఎంత బాగుంటదో, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సుమ గారు ఈ కాంబినేషన్ ఎంత బాగుంటదో, నాకు తెలిసి త్రివిక్రమ్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కూడా అంతే బాగుంటుంది. ఒకడికి ఒక ఎకరం సరిపోదా, వంద ఎకరాలు కావాలా అనే ఆలోచనలు ఉన్న పవన్ కళ్యాణ్ గారు, విలువలు లేనోడు ఎంత సంపాదించినా దానికి విలువ ఉండదు అని భావించే త్రివిక్రమ్ గారు, వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్ మన అందరికి ఆదర్శం. మెడ మీద చెయ్యి పెట్టిన ప్రతి వాడు పవన్ కళ్యాణ్ లా ఫీల్ అవ్వడం, పేపర్ మీద పెన్ను పెట్టిన ప్రతి ఒక్కడు త్రివిక్రమ్ గారిలా ఫీల్ అవ్వడం కామన్, ఎందుకంటే వాళ్లంటే మనకు అంత పిచ్చి కాబట్టి. నాకు తెలిసి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ ఆ కథలో పుట్టింది కాదు, అది పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గారి వ్యక్తిత్వాల నుంచి పుట్టిన డైలాగ్ అని నేను భావిస్తాను. ఫైనల్ గా నేను చెప్పే ఒకేఒక మాట త్రివిక్రమ్ గారు మీది భీమవరం, మీరు ఇండస్ట్రీకి రావడం మా అందరికి వరం, థ్యాంక్యూ సర్ అని అన్నారు.

Thaman : త్రివిక్రమ్ గారు లేకపోతే నేను లేను.. నాకు ఈ లైఫ్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు

దీంతో హైపర్ ఆది త్రివిక్రమ్ గురించి ఓ రేంజ్ లో పొగడటంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది. త్రివిక్రమ్ అభిమానులు ఈ స్పీచ్ ని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఇక త్రివిక్రమ్ మాట్లాడేటప్పుడు హైపర్ ఆదితో పర్సనల్ గా మాట్లాడని అనడం గమనార్హం.