Sahid Kapoor : సమంతకు షాహిద్ ఫిదా..

సౌత్ క్వీన్ సమంతతో కలిసి నటించాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టాడు బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్..

Sahid Kapoor : సమంతకు షాహిద్ ఫిదా..

Sam Sahid

Sahid Kapoor: సౌత్ క్వీన్ సమంతతో నటించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు బాలీవుడ్ యాక్టర్ షాహిద్ కపూర్. రీసెంట్‌గా ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో పాల్గొన్నాడు షాహిద్.

Chai – Sam : అందరి కళ్లూ ఆ డేట్ మీదే.. ఎందుకలా..?

ఈ సందర్భంగా ‘ది ఫ్యామిలీ మెన్ 2’ లో సమంత యాక్టింగ్ గురించి తన ఒపీనియన్ చెప్పాలని ఫ్యాన్స్, షాహిద్‌ను అడిగారు.. దీనికి షాహిద్ రెస్పాండ్ అవుతూ.. ‘ఫ్యామిలీ మెన్ 2 లో సమంత యాక్టింగ్‌కి ఫిదా అయ్యానని చెప్పాడు. అంతేకాదు తనతో కలిసి నటించాలనుందనే కోరికను కూడా బయటపెట్టాడు.

Samantha : నా ప్రేమ శాశ్వతం.. ఈ టాటూ కూడా.. సమంత షాకింగ్ రియాక్షన్..

షాహిద్ ‘ది ఫ్యామిలీ మెన్’ రెండు సిరీస్‌లను అద్భుతంగా దిద్దిన దర్శక ద్వయం రాజ్ – డీకేలతో తన రీసెంట్ సిరీస్ షూటింగ్ పూర్తి చేశాడు. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత తెలుగు ‘జెర్సీ’ రీమేక్ హిందీ ‘జెర్సీ’ లో నటించాడు షాహిద్. ఈ సినిమా డిసెంబర్ 31న రిలీజ్ కానుంది. సామ్, గుణ శేఖర్ డైరెక్షన్లో నటించిన హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

Jersey Movie : క్రేజీ డేట్ లాక్ చేసేశారు..