Karate Kalyani: నేనే తప్పు చేయలేదు.. నేనెక్కడికి పారిపోలేదు I did not do anything wrong .. I did not escape, Karate Kalyani

Karate Kalyani: నేనే తప్పు చేయలేదు.. నేనెక్కడికి పారిపోలేదు

ఇటీవలే యూట్యూబర్​ శ్రీకాంత్​రెడ్డితో సినీ నటి కరాటే కళ్యాణి మధ్య వివాదం హాట్​టాపిక్​గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఎస్సార్​నగర్​పోలీస్​స్టేషన్​లో ఒకరిపై మరొకరు ఇద్దరు ఫిర్యాదులు చేసుకున్నారు.

Karate Kalyani: నేనే తప్పు చేయలేదు.. నేనెక్కడికి పారిపోలేదు

Karate Kalyani: ఇటీవలే యూట్యూబర్​ శ్రీకాంత్​రెడ్డితో సినీ నటి కరాటే కళ్యాణి మధ్య వివాదం హాట్​టాపిక్​గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఎస్సార్​నగర్​పోలీస్​స్టేషన్​లో ఒకరిపై మరొకరు ఇద్దరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ తర్వాత కరాటే కళ్యాణిపై మరో వివాదం కూడా మొదలైంది. తాజాగా కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్‌ లేబర్ అధికారులు సోదాలు నిర్వహించగా.. కరాటే కల్యాణి అక్రమంగా చిన్నారిని కొనుగోలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేపట్టినట్లు అధికారులు చెప్పుకొచ్చారు.

Karate Kalyani: పాపని దత్తత తీసుకోలేదు.. కిడ్నాప్ కూడా చేయలేదు

అయితే, అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలో కళ్యాణి ఇంట్లో లేకపోవడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా ఈ ప్రచారానికి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు కళ్యాణి ఇప్పుడు మీడియా ముందుకొచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. నేనెక్కడికి పారిపోలేదన్న కళ్యాణి శ్రీకాంత్ రెడ్డితో గొడవ సమయంలో కింద పడిపోవడంతో దెబ్బ తగలగా ట్రీట్మెంట్ కోసం వెళ్లాలని.. దాంతో పాటు అంతకు ముందు నుండే తనకి జ్వరం ఉండగా అది ఇంకా ఎక్కువ కావడంతో వైద్యం కోసమే వెళ్లానని చెప్పారు.

karate Kalyani : కొత్త వివాదంలో కరాటే కళ్యాణి

ప్రచారం జరుగుతున్నట్లుగా తాను పారిపోయే రకం కాదని, ఎక్కడికి పారిపోలేదని స్పష్టం చేసింది. తాను పిల్లలను అమ్ముకోవడం ఎవరైనా చూశారా? అని, ఒంటరి మహిళ అంటే అంతా చులకనా? అంటూ పైర్‌ అయ్యారు. తన ఇంట్లోనే ఉండండని, స్ట్రింగ్‌ ఆపరేషన్‌ చేసుకోండని మీడియా వాళ్ళని ఆహ్వానిస్తూ ఆమె వ్యాఖ్యలు చేశారు. తన మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇదంతా కావాలనే ఎవరో పనిగట్టుకొని ప్రచారం చేస్తూ ముప్పేట దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

×