C Kalyan: నాకు పదవీ వ్యామోహం లేదు.. ఫిబ్రవరి 19న ‘టీఎఫ్‌పీసీ’ ఎన్నికలు: సి.కల్యాణ్

హైదరాబాద్, టీఎన్‌సీసీలో జరిగిన మీడియా సమావేశంలో ‘టీఎఫ్‌పీసీ’కి సంబంధించిన అనేక అంశాలపై సి.కల్యాణ్ స్పందించారు. ఫిబ్రవరి 19న టీఎఫ్‌పీసీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 1-6 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ఫిబ్రవరి 13. అభ్యర్థులు ఏదైనా ఒక్క పోస్టుకు మాత్రమే పోటీ చేయొచ్చు.

C Kalyan: నాకు పదవీ వ్యామోహం లేదు.. ఫిబ్రవరి 19న ‘టీఎఫ్‌పీసీ’ ఎన్నికలు: సి.కల్యాణ్

C Kalyan: వచ్చే నెలలో తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి (టీఎఫ్‌పీసీ) ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు సి.కల్యాణ్ వెల్లడించారు. హైదరాబాద్, టీఎన్‌సీసీలో జరిగిన మీడియా సమావేశంలో ‘టీఎఫ్‌పీసీ’కి సంబంధించిన అనేక అంశాలపై సి.కల్యాణ్ స్పందించారు.

Bengaluru: గొంతు కోసి డిగ్రీ విద్యార్థిని హత్య.. కాలేజీ నుంచి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన యువకులు

సమావేశంలో చర్చించిన విషయాల్ని, టీఎఫ్‌పీసీకి సంబంధించిన ఎన్నికల వివరాల్ని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఫిబ్రవరి 19న టీఎఫ్‌పీసీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 1-6 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ఫిబ్రవరి 13. అభ్యర్థులు ఏదైనా ఒక్క పోస్టుకు మాత్రమే పోటీ చేయొచ్చు. ఎన్నికల నిర్వహణ అధికారిగా కే.దుర్గా ప్రసాద్ కొనసాగుతారు. అదే రోజు సాయంత్రం ఈసీ మీటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం టీఎఫ్‌పీసీలో రూ.9 కోట్ల నిధులు ఉన్నాయి. ఈ స్థాయిలో నిధులు జమ కావడానికి దాసరి నారాయణ రావుగారే కారణం. మా సంస్థకు తిరుపతిలో ఒక బిల్డింగ్ ఉంది. అలాగే మూవీ టవర్స్‌లో రూ.2.40 కోట్లు పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అది రూ.10 కోట్లకు చేరింది.

Shubman Gill: డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై భారత్ భారీ స్కోరు

గత డిసెంబర్ 31 వరకు అన్ని లావాదేవీలు, అకౌంట్స్ వివరాలు ఈసీలో పాస్ అయినవే. మండలిలో మొత్తం 1200 మంది సభ్యులున్నారు. కొందరు ఈ సంస్థపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు బురదజల్లుతున్నారు. సంస్థకు ఎవరు చెడ్డపేరు తెచ్చినా ఊరుకోం. సంస్థపై అనవసర వ్యాఖ్యలు చేసిన నిర్మాత కే.సురేష్ కుమార్‌ను మూడేళ్లు సస్పెండ్ చేస్తున్నాం. మరో నిర్మాత యలమంచి రవికుమార్‌ను సంస్థ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. ఇకపై ఆయనకు, ఈ సంస్థకు ఎలాంటి సంబంధం ఉండదు. ‘టీఎఫ్‌పీసీ’ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. తప్పు చేస్తే నాపై కూడా చర్యలు తీసుకోవచ్చు. మాకు ఎలాంటి పదవీ వ్యామోహం లేదు. అందుకే త్వరలో ఎన్నికలు నిర్వహిస్తున్నాం. నేను ఎన్నికల్లో పోటీ చేయదలచుకోలేదు’’ అని సి.కల్యాణ్ అన్నారు.