రైతుల ఆందోళన విజువల్స్‌ను మర్చిపోలేకపోతున్నా: సోనూసూద్

రైతుల ఆందోళన విజువల్స్‌ను మర్చిపోలేకపోతున్నా: సోనూసూద్

Sonu Sood: బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ ఢిల్లీ బోర్డర్ వద్ద చేస్తున్న రైతుల ఆందోళన పట్ల విచారం వ్యక్తం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన గురించి మర్చిపోలేకపోతున్నా అన్నారు. ఇదే తరహాలో కొనసాగితే సామాన్యుడు సైతం దారుణంగా బాధపడాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తు చేశాడు. వణికిస్తున్న చలిలో కూర్చొని ఆందోళన చేస్తున్న రైతులను చూస్తే గుండె తరుక్కుపోతుంది.

‘హైవే మీద కూర్చొని వణుకుతూ.. చిన్న పిల్లలతో సహా ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతకాలం ఇలా చూస్తూ ఉంటాం. రైతుల గురించి విని అర్థం చేసుకోవాల్సిన సమయమిది’

ఇది చాలా బాధాకరం. ప్రతి సమస్యకు ఓ సమాధానం ఉంటుందని నమ్ముతాను. నేను పుట్టి పెరిగింది పంజాబ్‌లోనే. అక్కడి రైతులతో గడిపాను. పంజాబీ కమ్యూనిటీని నమ్ముతాను. వారికి సమయం కేటాయించి ప్రేమ చూపిస్తే కన్విన్స్ అవుతారు’ అని Sonu Sood అన్నారు.

ఈ 47ఏళ్ల యాక్టర్ రోడ్లపై కూర్చొండిపోయి ఆందోళన చేస్తున్న రైతుల గురించి వింటుంటే.. గుండె తరుక్కుపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో పొలాల్లో విత్తనాలు నాటి వ్యవసాయం చేయాల్సి ఉంది. కానీ, పిల్లలతో వాళ్లు పడుతున్న కష్టాలు చూస్తుంటే అలా కళ్లలో ఉండిపోతున్నాయి’ దేశమంతా వారి సమస్యకు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.