Pushpa: 4 సినిమాల కష్టం పుష్ప.. తగ్గేదే లే.. 17న వస్తున్నా..!

పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా హీరో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ జోష్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. పుష్ప తర్వాత వచ్చే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నాడు.

Pushpa: 4 సినిమాల కష్టం పుష్ప.. తగ్గేదే లే.. 17న వస్తున్నా..!

Allu Arjun

Pushpa: పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా హీరో ఐకన్ స్టార్ అల్లు అర్జున్ జోష్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. పుష్ప తర్వాత వచ్చే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నాడు. పుష్పతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాడు. దేవీశ్రీప్రసాద్‌తో ఇది తనకు థర్డ్ డికేడ్ అని చెప్పిన అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడని థ్యాంక్స్ చెప్పాడు. దాక్కో దాక్కో మేక.. సామీ సామీ.. చూపే బంగారమాయెనే.. ఊ అంటావా మావా.. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా.. అంటూ ప్రతి పాటనూ స్టేజ్ పై ఒక్కో పాట పాడి వినిపించాడు. అలాగే.. ప్రతి పాటకూ లిరిక్స్ లో వేరియేషన్ చూపించారని.. చంద్రబోస్ ను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశాడు.

వేదికపై.. డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్ లేకపోవడం తనకు బాధగానే ఉన్నా.. మూవీ ఫైనల్ మిక్సింగ్ కోసం వారు పడుతున్న శ్రమను అర్థం చేసుకోగలనని చెప్పాడు. తాను, సుక్కూ, దేవీ.. ముగ్గురం ఒకే టైమ్ లో కెరీర్ ప్రారంభించామని గుర్తు చేసుకున్నాడు.. బన్నీ. హీరోయిన్ రష్మిక గురించి మాట్లాడుతూ.. తాను ఆమెను రష్మికగా పిలుస్తానని.. చెప్పాడు. తను చాలా అభిమానించే హీరోయిన్లలో రష్మిక ఒకరని అన్నాడు. ఐటమ్ సాంగ్ లో చేసిన సమంతకు ప్రత్యేకంగా బన్నీ థ్యాంక్స్ చెప్పాడు. ఎలా అడిగితే.. అలా నటించిందని.. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా కో ఆపరేట్ చేసిందని అన్నాడు.

సినిమాలో విలన్ గా నటించిన సునీల్ ను.. చాలా రోజుల పాటు మరిచిపోలేరని చెప్పిన బన్నీ.. ఇతర కీలక క్యారెర్టర్లను అన్నిటి గురించీ చెప్పి.. చాలా బాగా నటించారంటూ అభినందించాడు. తనను చిన్నతనంలో ఎంతో ప్రేమించిన తన మామయ్యలను ఈ సినిమాతో నిర్మాతగా చేశానంటూ.. కాస్త ఎమోషనల్‌గా ఫీలయ్యాడు. ఇక.. సుకుమార్ ను ఈ ఈవెంట్ కు తీసుకురావడానికి ట్రై చేసీ చేసీ.. చివరికి తానే కన్విన్స్ అయ్యానని చెప్పాడు. ఈ సినిమాకు వచ్చే ఫలితం పూర్తిగా తమ ముగ్గురిదన్నాడు.

కరోనా ఇబ్బందుల తర్వాత విడుదలైన అఖండ సినిమా విజయవంతమైనందుకు.. ఆ సినిమా టీమ్ ను ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన బన్నీ.. తర్వాత వచ్చే సినిమాలను కూడా విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరాడు. పుష్ప తర్వాత.. శ్యామ్ సింగారాయ్, ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్, రాధేశ్యామ్, ఆచార్య వంటి పెద్ద సినిమాలు వస్తున్నాయని.. అన్నీ సూపర్ డూపర్ హిట్ కావాలని బన్నీ కోరుకున్నాడు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా అభినందించిన ఐకన్ స్టార్.. ఫ్యాన్స్ ను మించింది ఏదీ తనకు లేదని చెప్పాడు. తను ఈ స్థానంలో ఉన్నందుకు ఫ్యాన్సే కారణమని అన్నాడు. అంతా సేఫ్ గా ఇళ్లకు వెళ్లాలని కోరాడు. అలాగే.. థియేటర్లలో యజమానులు శానిటైజేషన్ ను సరిగా చేసి.. అంతా సేఫ్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని స్పెషల్ గా రిక్వెస్ట్ చేశాడు.

Read More:

Pushpa: తగ్గేదే లే.. అంటూ అదరగొట్టిన అల్లు అర్హ, అల్లు అయాన్

Pushpa: ఇండస్ట్రీకి బన్నీ బెస్ట్ గిఫ్ట్.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి

Pushpa Pre Release Event: ధూం ధాంగా.. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్..!