ఇద్దరిలోకం ఒకటే – ఫస్ట్ లుక్

దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

10TV Telugu News

దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ టీమ్..

రాజ్ తరుణ్, షాలినీ పాండే జంటగా.. దిల్ రాజు సమర్పణలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం: 35గా శిరీష్ నిర్మిస్తున ప్రేమకథా చిత్రం.. ‘ఇద్దరిలోకం ఒకటే’.. (యూ ఆర్ మై హార్ట్ బీట్) ట్యాగ్ లైన్. జి.ఆర్.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

దసరా సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. షాలినీ ఫుల్ జోష్‌లో బైక్ నడుపుతుండగా.. రాజ్ తరుణ్ వెనక కూర్చుని నవ్వుతూ ఆమెని చూస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటుంది.

Read Also : ‘ఎంత మంచివాడవురా’.. దసరా విషెస్ – టీజర్ అప్‌డేట్..

గతకొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న రాజ్ తరుణ్, ఈ సినిమా తనకి బ్రేక్ ఇస్తుందనే హోప్‌తో ఉన్నాడు. కెమెరా : సమీర్ రెడ్డి, ఎడిటింగ్ : తమ్మిరాజు, మ్యూజిక్ : మిక్కీ జె.మేయర్, మాటలు : అబ్బూరి రవి, సహ నిర్మాతలు : హర్షిత్ రెడ్డి – బెక్కెం వేణుగోపాల్.

  

×