Jr NTR – Mahesh : మీరు సంక్రాంతికొస్తే.. మేం సమ్మర్‌కి షిఫ్ట్ అవుతాం..

రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తేనే కానీ మిగతా సినిమాల విడుదలకు లైన్ క్లియర్ అవదు..

Jr NTR – Mahesh : మీరు సంక్రాంతికొస్తే.. మేం సమ్మర్‌కి షిఫ్ట్ అవుతాం..

Jr Ntr Mahesh

Jr NTR – Mahesh: 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా సినిమా పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. షూటింగులు, రిలీజులు ఆగిపోయాయి. థియేటర్లు బంద్ అయిపోయాయి.. పరిస్థితులు చక్కబడుతున్నా.. ప్రేక్షకులు థియేటర్లకు ఎంత వరకు వస్తారనే సందేహంతో ఉన్న దర్శక నిర్మాతలకు ఇటీవల వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా కాస్త ధైర్యాన్నిచ్చింది.

Maanaadu Trailer : శింబు అదరగొట్టేశాడు..

మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల ఎంతలా ఆదరిస్తారు అనే విషయం మరోసారి నిజం చేసింది లవ్ స్టోరీ సినిమా.. దీంతో తమ సినిమాల విడుదల తేదీలకు పోటీ పడుతున్నారు మేకర్స్. ఇక పెద్ద సినిమాలైతే పండుగ సీజన్లని ఆక్రమించేస్తున్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ పార్ట్ 1 డిసెంబర్ 17న రిలీజ్ చెయ్యనున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసేశారు.

Uttej Emotional Words : ‘చాలా నొప్పిగా ఉంది పద్దూ’.. కంటతడి పెట్టిస్తున్న ఉత్తేజ్ మాటలు..

ఇక అందరి కళ్లూ సంక్రాంతి మీదే ఉన్నాయి. ఇప్పటికే ‘రాధే శ్యామ్’, ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్’, ‘ఎఫ్ 3’ సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ అయిపోయాయి. అయితే ‘ఆర్ఆర్ఆర్’ పరిస్థితి ఏంటి?.. అక్టోబర్ నెలలోనే పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుంటుంది అని చెప్పారు కాబట్టి నవంబర్, డిసెంబర్ లేదా సంక్రాంతికి వస్తుందా?.. అనే సందేహం నెలకొంది.

Republic Review : ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

ఎందుకంటే పాన్ ఇండియా సినిమాతో పోటీ పడే సాహసం చెయ్యరు ఎవరు కూడా.. ‘ఆర్ఆర్ఆర్’ టీం రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తేనే కానీ మిగతా నిర్మాతలు తమ సినిమా రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకోవాలి. టాలీవుడ్‌లో లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ కనుక సంక్రాంతికి వస్తే.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సమ్మర్‌కి షిఫ్ట్ అవుతుంది.. వీలైతే ఉగాదికి రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారు నిర్మాతలు అనే మాటలు వినిపిస్తున్నాయి.. జక్కన్న రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తేనే కానీ మిగతా సినిమాల విడుదలకు లైన్ క్లియర్ అవదు.

MAA Elections 2021 : ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బండ్ల గణేష్..